)
Kavitha Vs Harish Rao: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి బాంబ్ పేల్చారు. ఈసారి సొంత పార్టీ లీడర్, ట్రబుల్ షూటర్ హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావును టార్గెట్ చేశారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో.. సొంత పార్టీ నేతలపై కవిత నిప్పులు చెరిగారు. ఈ కేసు సీబీఐ వరకు వెళ్లేందుకు హరీశ్ రావే కారణమంటూ ఆరోపణలు గుప్పించారు. కాళేశ్వరం వందల కోట్లు వెనకేసుకుని.. కేసీఆర్ ప్రతిష్టను హరీశ్ రావు దెబ్బతీశారని విమర్శించారు.. కేసీఆర్‌పై అవినీతి మరకపడ్డాక... పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నారు. మరోవైపు తనపై ఎవరైనా ట్రోల్ చేస్తే తోలు తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే కవిత వార్నింగ్ బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించింది. ఆ వెంటనే చాలామంది నేతలు హుటాహుటిన ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. నేతలంతా కవితపై చర్యలు తీసుకోవాలని అధినేతను కోరినట్టు తెలుస్తోంది.
అయితే హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ హైకమాండ్ మౌన వ్యూహం పాటిస్తోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క లీడర్ స్పందించలేదు. కానీ మాజీమంత్రి హరీశ్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ నుంచి ఓ ట్వీట్ పెట్టారు. హరీష్ రావుకు తమ మద్దతు ఉంటుందన్న పరోక్ష సంకేతాలను పంపడానికి ఆయనను ఆరు అడుగుల బుల్లెట్టు అని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టారు. కేటీఆర్ దానికి మరిన్ని పొగడ్తలు జత చేసి రీట్వీట్ చేశారు . అంతే కానీ కవిత ఆరోపణలను ఖండించడం కానీ.. తిరస్కరించడం కానీ చేయలేదు. అయితే కవిత ఆరోపణలపై హరీశ్ రావు మాత్రం సీరియస్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న హరీశ్ కు గులాబీ బాస్ కేసీఆర్ ఫోన్ చేసి బుజ్జగించినట్టు తెలుస్తోంది. కవిత ఆరోపణలను సీరియస్‌గా తీసుకోవద్దని హరీశ్ రావును కేసీఆర్ కోరినట్టు సమాచారం. కానీ సరైనా సమయంలో కవితపై చర్యలు ఉంటాయని హరీశ్‌తో చెప్పిన కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకునే అవకాశం లేదనే సంకేతాలను కేసీఆర్ పంపినట్టు ప్రచారం సాగుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో కవిత ఆరోపణలు ఖండిస్తే.. ఆమెకు మరింత లాభం జరుగుతుందనే ఆలోచనలో బీఆర్ఎస్ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కవిత ఏపిసోడ్‌పై నేతలెవ్వరూ స్పందించవద్దని పార్టీ హైకమాండ్ ఆదేశించినట్టు సమాచారం. ఇప్పటివరకు గులాబీ పార్టీలో క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా హరీశ్‌కు గుర్తింపు ఉంది. పార్టీ కోసం కష్టపడతాడు.. మామ కోసం ఏదైనా చేస్తాడని పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హరీశ్ రావుపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. కానీ ఇప్పుడు కవిత నేరుగా హరీశ్ రావును సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో వందల కోట్లు వెనకేసుకున్నాడని ఆరోపించారు. అంతేకాదు.. ఆయన్ను ఇరిగేషన్ మినిస్ట్రీ నుంచి తప్పించారని గుర్తు చేశారు. అయితే కవిత ఆరోపణలు బీఆర్ఎస్ నేతలు ఖండించకపోవడంపై హరీశ్ రావు వర్గం జీర్ణించుకోలేక పోతుందని ప్రచారం సాగుతోంది. ఎదో కండితుడుపు చర్యగా రెండు ట్వీట్లు పెట్టి వదిలేశారని, కానీ కవితపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని గుసగుసలాడుకుంటున్నారు.
మొత్తంమీద కవిత ఏపిసోడ్‌పై కేసీఆర్ కాస్తా సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కవితకు మరోచాన్స్ ఇచ్చే ఆలోచనలో బాస్ ఉన్నారని చెబుతున్నారు. కానీ కవితపై సరైనా సమయంలో చర్యలు తప్పక ఉంటాయని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. సుమారు 10 నుంచి 15 రోజుల్లో కవితపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఆలోపు మరోసారి కవిత మీడియా ముందుకు వచ్చి బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తే మాత్రం.. ధీటైన కౌంటర్ ఇవ్వాలని నేతలకు ఆదేశాలు వెళ్లినట్టు చెబుతున్నారు.. ఇదిలా ఉంటే.. కవితపై చర్యలు తీసుకోకపోతే మాత్రం.. హరీశ్ పార్టీకి పార్టీకి దూరమయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.