ktr fires on cm revanth reddy govt video: తెలంగాణలో రాజకీయాలు ఒక రేంజ్ హట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య రాజకీయాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంలా మారాయి. ఏమాత్రం చాన్స్ దొరికిన కూడా బీఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్య మాటలు యుద్దాలు నడుస్తున్నాయి. చాలా సందర్భాలలో నువ్వెంత.. అంటే నువ్వెంత అన్న విధంగా ఆరోపణలుగుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీఆర్ఎస్ దళపతి కేసీఆర్ తాజగా.. ఫామ్ హౌస్ నుంచి మాట్లాడుతూ అభిమానుల్లో జోష్ ను నింపారు. వచ్చేది మన ప్రభుత్వమే అన్నారు. తెలంగాణలో కొంత మంది బద్మాష్ గాళ్లు తయారయ్యారని,వాళ్లను ఎదుర్కొవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రతి కార్యకర్త ఒక్కొ కేసీఆర్ లా మారి.. అపోసిషన్ పార్టీలను ఎదుర్కొవాలన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ లో బీఆర్ఎస్ సన్నాహక సభలో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్య మన్నారు. ఇక్క పోలీసులు కేవలం బీఆర్ఎస్ వాళ్లను టార్గెట్ చేశారన్నారు. సోషల్ మీడియాలో ఏమన్న పోస్ట్ లుపెట్టగానే..వెంటనే అరెస్ట్ లు చేస్తున్నారన్నారు. మరీ వాళ్లకు ఇంకా వేరు కేసులు ఉన్నాయా.. లేదా బీఆర్ఎస్ వాళ్లను టార్గెట్ చేయడమే డ్యూటీనా అంటూ మండిపడ్డారు.
బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టె పోలీసుల పేర్లు రాసుకొని పెట్టుకోండి
ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు.. దేశం దాటినా రప్పించి మరీ ఏం చెయ్యాలో అది చేస్తా - కేటీఆర్ pic.twitter.com/KN813awYIB
— Telugu Scribe (@TeluguScribe) March 23, 2025
తమకు టైమ్ వస్తుందని.. ఏ ఒక్కరిని వదలబొమని మండిపడ్డారు. కేసీఆర్ అంత మంచోడ్ని తాను కాదని.. అందరి చిట్టాలు విప్పుతానని అన్నారు. ఒక వేళ రిటైర్ అయిపోయి.. ఇతర దేశాలకు వెళ్లి దాక్కుంటామన్న.. వదలమన్నారు. లాక్కొచ్చి.. ఒక్కొక్కరి చరిత్రల్ని బైటకు తీస్తామని ఇన్ డైరెక్ట్ గా బీఆర్ఎస్ నేతల్ని, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అమలు కానీ 420 హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారన్నారు.
కొన్నినెలలుగా ప్రజల్ని తెగ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ప్రజలు ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు. రేవంత్ సర్కారు అన్నివిధాలుగా ప్రజలను మోసం చేసిందన్నారు. కేవలం ఇక్కడ సంపదను దోచిపెట్టి.. ఢిల్లీకి రేవంత్ సంచుల్ని మోసుకుని వెళ్తున్నాడన్నారు. అందరికి వడ్డీతో సహా లెక్కలు తెలుస్తామని కేటీఆర్ కరీంనగర్ వేదికగా మాస్ ధమ్కీ ఇచ్చారు. ఒక నాడు తెలంగాణ ఉనికి లేదన్న నాడు.. కేసీఆర్ ను కరీంనగర్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









