Formula e car race case: ఫార్మూలా ఈ కారు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్ కు ఏసీబీ ఆదేశాలు..

ktr on formula e car race case: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ముందు హజరయ్యారు. దాదాపుగా ఎనిమిది గంటల పాటు ఏసీబీ అధికారులు ఈ కేసు విషయంలో ఆయనపై పలు కోణాల్లో ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 16, 2025, 06:57 PM IST
  • ఏసీబీ ముందు హజరైన కేటీఆర్..
  • సెల్ ఫోన్ అప్పగించాలని కేటీఆర్ కు ఆదేశాలు..
Formula e car race case: ఫార్మూలా ఈ కారు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్ కు ఏసీబీ ఆదేశాలు..

 ktr attended before acb on formula e car race case: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్మూలా ఈ కారు రేసింగ్ కేసులో ఏసీబీ అధికారుల ఎదుట హజరయ్యారు. ఈ క్రమంలో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ కారు రేసింగ్ లో నిధులు పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేశారని అనేక ఆరోపణలు వచ్చాయి.

Add Zee News as a Preferred Source

దీనిపై ఏసీబీ అధికారులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. కేటీఆర్ ఏసీబీ ఎదుట హజరయ్యారు. ఈ క్రమంలో..  కేటీఆర్ ను ఈ ఫార్మూలా కారు రేసులో అరవై వరకు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఈ  కేసులో ముఖ్యంగా.. ఏసీబీ అధికారుల కేటీఆర్ సెల్ ఫోన్ ను సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ కేటీఆర్ తాను.. సెల్ ఫోన్ తీసుకొని రాలేదని చెప్పారు.

ఈ రేసు సమయంలో వాడిన సెల్ ఫోన్ లను తమకు అప్పగించాలని ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ఆదేశించారు. ఈ నెల 18 లోపు సెల్ ఫోన్ లను తమకు అప్పగించాలని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. విచారణ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఈ అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

కేటీఆర్ ఈరోజు ఉదయం బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ కు లాయర్ రామచందర్ రావుతో కలిసి లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో ఎనిమిది గంటల పాటు విచారించిన కోర్టు  మరల.. ఈనెల 13 న తమ ఎదుట హజరు కావాలని కూడా నోటీసులు జారీ చేసింది.  ముఖ్యంగా నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీలకు నగదు బదిలీకి సంబంధించి ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.

Read more: Minister Seethakka: కేటీఆర్ జైలుకెళ్తా వ్యాఖ్యల వెనుక అసలు స్కెచ్ ఇదే..!.. బాంబు పేల్చిన మంత్రి సీతక్క.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త రచ్చ..

మరోవైపు కేటీఆర్ ను ఏ నిమిషంలో అయిన అరెస్ట్ చేయోచ్చని రూమర్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. దీంతో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏసీబీ కార్యలయం సమీపంలో పరిసర ప్రాంతాలలో చేరుకుని తమ ప్రియమైన నేత కోసం పెద్ద ఎత్తున ఎదురు చూశారు.. ఈక్రమంలో కేటీఆర్ బైటకు రావడంతో అరెస్ట్ ఊహాగానాలకు తెర పడింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News