BRS KTR: రేవంత్ రెడ్డి కాపురంలో చిచ్చుపెట్టిన కేటీఆర్.. రోజు ఉదయం 5 గంటలకు అక్కడికి వెళ్లేవాడంటూ షాకింగ్ కామెంట్స్..

ktr vs cm revanth reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మైహోమ్ భూజాకు సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లేవాడని కామెంట్స్ చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 17, 2025, 08:47 PM IST
  • సీఎం రేవంత్ పై మండిపడిన కేటీఆర్..
  • ఆయన గొడలు దూకేవాడంటూ కామెంట్లు..
BRS KTR: రేవంత్ రెడ్డి కాపురంలో చిచ్చుపెట్టిన కేటీఆర్.. రోజు ఉదయం 5 గంటలకు అక్కడికి వెళ్లేవాడంటూ షాకింగ్ కామెంట్స్..

brs working president fires on cm revanth reddy: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం సమ్మర్ లో మరింత హీట్ ను పెంచేవిగా మారాయి.ఈ క్రమంలో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దాలు పీక్స్ కు చేరిపోయాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం వల్లనే తెలంగాణకు ఈ దుస్థితి దాపరించిందని సీఎం రేవంత్ విమర్శలు చేస్తున్నారు. మరొవైపు బీఆర్ఎస్ నేతలు.. అమలు చేయడానికి కూడా అవకాశంలేని 420 హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు గట్టిగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.

Add Zee News as a Preferred Source

ఇటీవల రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ఇష్టమున్నట్లు పోస్టులు పెడితే కఠిన చర్యలుంటాయని తెల్చిచెప్పారు. ఎవరైన వ్యక్తిగతంగా కానీ.. కుటుంబ సభ్యుల మీద, పిల్లల మీద కాంట్రవర్సీలుగా పోస్టులు పెడితే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఎవరిని కూడా వదలబోమని కేసులు పెట్టి బొక్కలో వేసుడే నంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే.. ప్రస్తుతం  దీనిపై  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

మీ కుటుంబాలు, పిల్లలు, మహిళలకేనా.. సమాజంలో గౌరవ, మర్యాదలు ఉండేది.. ఇతరులకు ఫ్యామిలీలు ఉండవా.. అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా.. గతంలో తాము.. అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిరోజు కూడా  ఉదయం 4 గంటలకు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తు మై హోమ్ భూజాకు వెళ్లేవాడని.. అంత పొద్దున గొడలు దూకి మరీ వెళ్లాల్సిన అవసరం ఏముందన్నారు.  సాగర్ సొసైటీలో ఎంత సమయంగడిపారో.. ఆయన ఏంచేసేవారో తమదగ్గర చిట్టా అంతా ఉందని కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Read more: Telangana Assembly Budget Session: నేడు తెలంగాణ శాసనసభ ముందుకు కీలక బిల్లులు..

రేవంత్ రెడ్డి.. ప్రతిసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ నేతలకు డబ్బుల సంచులు ట్రాన్స్ పొర్ట్ చేస్తున్నాడని విమర్శించారు. మరోవైపు.. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ చేసిన వ్యాఖ్యలను కమలనాథులు ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి.. బీజేపీతో లోపాయ కారి ఒప్పందం పెట్టుకున్నాడని కేటీఆర్ విమర్శలు చేశారు.  ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట హట్ టాపిక్ గా మారాయి. రేవంత్ కాపురంలో కేటీఆర్ చిచ్చుపెట్టాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News