BRS KTR Video: రేవంత్ రెడ్డి ఒక పిచ్చిసన్నాసి..!..ఇదిగో ప్రూఫ్.. మరోసారి ఇచ్చిపడేసిన కేటీఆర్.. వీడియో ఇదే..

ktr fires on cm revanth reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. కొంత పోలీసులు ఆయనకు ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారని ఎద్దెవా చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన కూడా కాంగ్రెస్ సర్కారులో మార్పురాలేదన్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 17, 2025, 12:47 PM IST
  • రేవంత్ పై మండిపడిన కేటీఆర్..
  • సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన బుద్దిరాలేదని వ్యాఖ్యలు..
BRS KTR Video: రేవంత్ రెడ్డి ఒక పిచ్చిసన్నాసి..!..ఇదిగో ప్రూఫ్.. మరోసారి ఇచ్చిపడేసిన కేటీఆర్.. వీడియో ఇదే..

ktr fires on cm revanth reddy video viral: తెలంగాణలో ప్రస్తుతం హైదరబాద్ సెంట్రల్ యూనివర్సీటీ కంచ భూముల వివాదం రాజకీయంగా కాకరేపుతుంది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ ను, బీజేపీని ఏకీపారేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కంచ భూముల వివాదంలో తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. 1996 లోని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా.. అని ప్రభుత్వ తరపు లాయర్ పై ప్రశ్నల వర్షం కురిపించింది.

Add Zee News as a Preferred Source

ఈ ఘటనలో ఏదైన లోపాలున్నట్లు బైటపడితే.. సీఎస్ తో సహా దీనిలో ఉన్న అధికారులంతా జైలుకు పోవాల్సిందేనని జస్టిస్  గవాయితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. ఇది కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటిదన్నారు. అదే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా.. మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు  తెలంగాణ సర్కారును మొట్టికాయలు వేసిన అంశంపై మాట్లాడారు.

 

సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పిచ్చిసన్నాసి అని కేటీఆర్ అన్నారు. ఆయన చెరువుల్ని  కూడా తాకట్టు పెట్టాడన్నారు.  తెలంగాణ రాష్ట్ర సంపద అనేది మొత్తం డెంజర్ లో పడిందని సెంట్రల్ ఎంపవర్ మెంట్ కమిటి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిందన్నారు. అదే విధంగా రేవంత్ తప్పిదాల వల్ల సీఎస్, ఫారెస్ట్ అధికారులు రిస్క్ లో పడ్డారని.. భవిష్యత్తులు ఇతర శాఖల అధికారులకు కూడా ఇదే విధంగా జరగచ్చని అన్నారు.

కొంత మంది పోలీసులు రేవంత్ కు ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారని , అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు.  అలాంటివారిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ హెచ్చరించారు. అదే విధంగా ప్రధాని మోదీ.. కంచ భూముల వివాదంపై హర్యానాలో మాట్లాడారని.. మరీ ఈ కుంభకోణపై మోదీ విచారణకు ఎందుకు ఆదేశించలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. ఈ ఘటనపై తాము బీఆర్ఎస్ తరపున ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ముందుంచామన్నారు.

Read more: Supreme Court On Kancha Gachibowli: కంచ భూములు వివాదం.. సీఎం రేవంత్ సర్కారుపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు..

మోదీకి నిజంగా చిత్త శుద్ది ఉంటే దీనిపై విచారణకు ఆదేశించాలన్నారు. తాము అన్నట్లే..రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు.దీనిపై.. సీఈసీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిందన్నారు. అదే విధంగా.. సీఎం రేవంత్ దుర్మార్గంగా వందల ఎకరాలు నరికేసి.. అటవి నిబంధనలు తుంగలో తొక్కారన్నారు.  ప్రస్తుతం జంతుజాలం, పర్యావరణం మనుగడ ప్రమాదంలో పడిందని బీఆర్ఎస్ కేటీఆర్  కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News