Brs working president ktr sensational comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు. ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ళకు ఉప ఎన్నికలు ఖాయమన్నారు. అదే విధంగా.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25ఏళ్లు పూర్తయ్యిందన్నారు.
ఈ పండుగ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ టీడీపీ తర్వాత.. 25ఏళ్ల పాటు పార్టీని నడిపింది కేసీఆర్ మాత్రమే అని గర్వంగా చెప్పారు. టీడీపీ, బీజేపీ,కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొని కేసీఆర్ పార్టీ పెట్టారని గుర్తు చేశారు. కులబలం, ధనబలం లేకుండా కేసీఆర్ పార్టీని స్థాపించారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు హైదరాబాద్ నగరంలో స్థలం ఇవ్వలేదని.. కొండా లక్ష్మణ్ బాపూజీ తన స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే నాటి ప్రభుత్వం ఆఫీసును ఖాళీ చేయించిందన్నారు.
రేవంత్ రెడ్డికి రక్షణ కవచమే తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
తెలంగాణలో బీజేపీకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు.. ఒకరు సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయ మంత్రి
బీజేపీకి 8 ఎంపీలను ఇస్తే ఒక్క రూపాయి తీసుకురారు, కాంగ్రెస్‌ను ఒక్క మాట అన్నారు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/OpMzCTfZeG
— KTR News (@KTR_News) April 19, 2025
హైదరాబాద్ లో ఎన్నికలలో బీఆర్ఎస్ సూపర్ హిట్ అయిందని.. హైదరాబాద్ బయట కాంగ్రెస్ చేతిలో ప్రజలు మోసపోయారన్నారు. రేవంత్ రెడ్డి.. తన అన్న ఇల్లును కూలగొట్టరు కానీ.. హైడ్రా పేరుతో పేదల ఇళ్ళు కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
17నెలల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని అన్నారు. అదే విధంగా రేవంత్ పాలన వల్ల.. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలు అయింది పథకాలకు పైసలు లేవు కానీ.. లక్షన్నర కోట్లు పెట్టి మూసీ కడతానని రేవంత్ రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో హైడ్రా,మూసీ,సెంట్రల్ యూనివర్సిటీ భూముల పేరుతో రేవంత్ అరాచకాలు చేశారన్నారు.
ఒక్క జింకను చంపిన సల్మాన్ ఖాన్ ను జైల్లో పెట్టారని, మరి నాలుగు జింకలను చంపిన రేవంత్ రెడ్డిని ఏం చేయాలని ప్రజల్ని ప్రశ్నించారు. సందట్లో సడేమియాలా.. బీజేపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారన్నారు. కానీ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ తుఫాన్ ఖాయమన్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పై ఒక్క మాట మాట్లాడరని మండిపడ్డారు.
ఇద్దరు కేంద్రమంత్రులతో ఊరు కాలదు పీరు లేవదని సెటైర్ లు వేశారు. 17నెలల్లో తెలంగాణకు బీజేపీ చేసిన ఒక్క పైసా పనికాలేదన్నారు. అదే విధంగా.. పేరు చెప్పకుండా నేను ఒక బీజేపీ ఎంపీని అంటే గుమ్మడి కాయ దొంగల్లాగా భుజాలు తరుముకుంటున్నారని పంచ్ లు వేశారు. కాంగ్రెస్ ను నమ్మి మొన్ననే మొసపోయాం.. ఈసారి బీజేపీని నమ్మితే మోసపోతామని ప్రజలు భయపడుతున్నారన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఈడీ ఛార్జ్ షీట్ పెడితే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మోదీ,రేవంత్ రెడ్డిది దృఢమైన బంధంమన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో మోదీ ఎందుకు విచారణ చేయించడం లేదన్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పై ఒక్క మాట మాట్లాడరని శివాలెత్తిపోయారు. ఇద్దరు కేంద్రమంత్రులతో ఊరు కాలదు పీరు లేవదన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









