Brs working president ktr on formula e race case: తెలంగాణలో రాజకీయాలు వర్షకాలంలో హీట్ ను పుట్టిస్తున్నాయి. ఒక వైపు బీఆర్ఎస్ అక్రమ పాలన వల్ల తెలంగాణ పదేళ్లు వెనక్కుపోయిందని సీఎం రేవంత్ ఆరోపిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. కాంగ్రెస్ కు ఎన్నికల వేళ ఇచ్చిన హమీలను నెరవేర్చడం చాతకాక.. బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తుందంటూ కౌంటర్ లు ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్ , బీఆర్ఎస్ ల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి.
ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్... కేటీఆర్‌కు ఫార్ములా-ఈ రేసులో ఏసీబీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది.
ఈ క్రమంలో కేటీఆర్ గతంలో ఏసీబీ మే నెల 28న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. అయితే.. ఆయన తాను విదేశీపర్యటనకు వెళ్తున్నట్లు సమాధానం ఇచ్చారు. దీంతో ఏసీబీ.. మరోసారి ఈనెల 16న సోమవారం తమ ఎదుట హజరవ్వాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్మూలాఈ కారు రేసులో.. సుమారు.. రూ.55 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ కేసులో.. కేటీఆర్‌ను ఏ1గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను ఏ2గా, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఇప్పటికే ఏసీబీ.. అర్వింద్ కుమార్, బీఎల్ ఎన్ రెడ్డి స్టేట్ మెంట్ లను రికార్డు చేసింది. ఈ క్రమంలో సోమవారం ఏసీబీ ముందు కేటీఆర్ హజరు కాబోతుండటం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇప్పటికే రేవంత్ కేవలం.. ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాడని.. ఒక్కరూపాయి సైతం.. ఈ రేసులో అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అక్రమంగా కేసులు పెట్టిందన్నారు.
ఈ క్రమంలో కేటీఆర్... రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఉదయం10 గంటలకు బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరవుతారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో రేపు ఏంజరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.