Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌

Employees Jackpot Govt Of Telangana Govt Clears Pending Bills Up To Date: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వరుసగా కానుకలు అందిస్తోంది. ఇప్పటికే ఒక డీఏ విడుదల చేయగా.. విద్యుత్‌ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఒక డీఏ విడుదల చేయగా.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేసింది. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 23, 2025, 03:11 PM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌

Employees Pending Bills Clear: అసంతృప్తితో రగిలిపోతున్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించంది. ఇప్పటికే కరువు భత్యం విడుదల చేయగా.. మరికొన్ని డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగుల్లో కీలకమైన డిమాండ్‌ 'పెండింగ్‌ బిల్లుల చెల్లింపు'. ఆ డిమాండ్‌ను కూడా కొంత మేర నెరవేర్చింది. బకాయిపడిన మెడికల్‌ బిల్లులకు మోక్షం ప్రసాదించింది. మొత్తం బిల్లులను క్లియర్‌ చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యోగుల సంఘం తెలిపింది. టీఎన్‌జీఓ సెంట్రల్‌ యూనియన్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Big Shock: కాంగ్రెస్ పార్టీకి.. రేవంత్ రెడ్డికి భారీ షాకిచ్చిన సబితా ఇంద్రారెడ్డి

'ప్రభుత్వ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న అన్ని వైద్య బిల్లులను ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం క్లియర్‌ చేసింది' అని టీఎన్‌జీఓ సెంట్రల్ యూనియన్ తెలిపింది. తమ నిరంతర ప్రయత్నాలతో ప్రభుత్వం ఇప్పటివరకు క్లియర్ సిందని టీఎన్‌జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్ ప్రకటించారు. 'ప్రభుత్వ స్థాయిలో ఇంకా ఏవైనా వైద్య బిల్లులు పెండింగ్‌లో ఉంటే కేంద్ర యూనియన్ దృష్టికి అందించాలి' అని అభ్యర్థించారు.

Also Read: Harish Rao: 'తెలంగాణకు రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి ఉరి తీసినా తప్పులేదు'

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఐదు కరువు భత్యం ఉండగా.. పీఆర్‌సీ విడుదల చేయలేదు. ఇప్పటికే జీతాల పెంపు ఉండాల్సి ఉండగా అదీ లేదు. ఇక ఉద్యోగుల కోట్లాది రూపాయల బిల్లులన్నీ విడుదల కావడం లేదు. ఆరోగ్యంతోపాటు ఇతర బిల్లులన్నీ బకాయి పడింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని నెలల కిందట సమ్మెకు సిద్ధమైన విషయం తెలిసిందే. సమ్మె హెచ్చరికతో దిగివచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కమిటీలు, చర్చలు.. మంత్రివర్గ తీర్మానం తదితర పరిణామాల అనంతరం ఇటీవల ఒక డీఏ విడుదల చేసింది. మొన్న విద్యుత్‌ ఉద్యోగులకు డీఏ కూడా విడుదలైంది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు సంబంధించి వైద్యపరమైన బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్క బిల్లు కూడా పెండింగ్‌లో ఉంచకుండా ఆమోదించడంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట లభించింది. మిగతా వాటిని కూడా ప్రభుత్వం విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News