Bar And Restaurant Notification: తెలంగాణలో మద్యం విక్రయాలకు ప్రభుత్వం కొత్త దారులు అన్వేషిస్తోంది. ఎక్సైజ్ శాఖ ఆదాయం భారీగా పెంచుకునేందుకు మార్గాలు చూస్తున్న క్రమంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా బార్ల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. అయితే హైదరాబాద్ పరిధితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త బార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం విశేషం. కొత్త బార్లకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also Read: Bandi Sanjay: రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన బండి సంజయ్.. 'నీ కన్నా కేఏ పాల్ నయం'
గ్రేటర్ హైదరాబాద్ పరిధితోపాటు తెలంగాణలో కొత్త బార్లకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 41 కొత్త బార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి జీహెచ్‌ఎంసీ మినహాయించి రాష్ట్రంలో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్‌కు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. జీహెచ్ఎంసీలో అనుమతి ఇచ్చిన 16 కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్‌కు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం జీహెచ్ఎంసీలో కొత్త బార్ అండ్ రెస్టారెంట్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
Also Read: Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం విషమం.. హుటాహుటిన ముంబైకి తరలింపు
ఒక్కో బార్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు రూ.లక్ష ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దరఖాస్తు చేసుకున్న అనంతరం చెల్లించిన రూ.లక్ష తిరిగి ఇవ్వలేమని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఒక్కో బార్‌కు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లక్కీడ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. ఏప్రిల్ 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 1,171 బార్లు,
వైన్స్లు 2,620 ఉన్నాయి.
కాగా ప్రస్తుతం కొనసాగుతున్న బార్ అండ్ రెస్టారెంట్‌లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త బార్లకు నిర్ణయించడం.. వాటికి నోటిఫికేషన్ విడుదల చేయడంతో దరఖాస్తులకు స్పందన ఉండదని తెలుస్తోంది. కొత్త బార్లు ఎందుకని బార్ అండ్ రెస్టారెంట్స్ యజమానులు నిలదీస్తున్నారు. అయితే 2017 జనవరిలో ఆగిపోయిన టెండర్లనే మళ్లీ ఇప్పుడు కొత్తగా పిలుస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ వివరణ ఇస్తోంది.
ప్రభుత్వం తీసుకువచ్చిన వైన్స్ దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేయడంతో బార్ అండ్ రెస్టారెంట్స్‌కు ఆదరణ తగ్గిపోతోంది. బార్ అండ్ రెస్టారెంట్లకు వచ్చేందుకు తాగుబోతులు ఆసక్తి కనబర్చడం లేదు. వైన్ షాపుల వద్ద ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్‌లలోనే మందుబాబులు తాగి.. తిని వెళ్లిపోతున్నారు. దీంతో బార్ అండ్ రెస్టారెంట్ల వైపు చూడడం లేదు. ఇప్పటికే ఈ పర్మిట్ రూమ్‌లపై బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్మిట్ రూమ్‌లు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









