Betting Apps Promotion: మన సెలబ్రిటీలకు ఏది మంచో.. ఏది చెడో వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ డబ్బులొస్తున్నాయి కదా అని అడ్డమైన వాటిని ప్రమోట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాంటి దుర్మార్గమైన ప్రకటనలు చేస్తోన్న సెలబ్రిటీల భరతం పడుతోంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో రమ్మీ సహా వివిధ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ అమాయక ప్రజల జేబులు చిల్లి పడటానికి కారణం అవుతున్న సెలబ్రిటీలపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో పలువురు బాలీవుడ్ నటులపై కేసులు నమోదు చేశారు. టాలీవుడ్‌కు సంబంధించి నటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్‌త పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తెలుగు సహా హిందీ నటీనటులకు వరకు అందరిపైనా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో యాంకర్ విష్ణు ప్రియ ఈ రోజు పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. విష్ణుప్రియ అడ్వకేట్తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన మరో ఆరుగురికి పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. యాంకర్ శ్యామల, రీతు చౌదరి, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులిచ్చారు. ఈ రోజు (గురువారం) విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్ విచారణకు హాజరయ్యాడు. కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్ ఆసిఫ్‌నగర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కిరణ్‌గౌడ్ యూట్యూబర్ ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశాడు. దీంతో పోలీసులు అతని పైనా కేసు నమోదు చేశారు.
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. హీరో, హీరోయిన్లలతో పాటు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లపై గట్టి నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో హర్ష సాయి, ఇమ్రాన్లు దుబాయ్ లేదా బ్యాంకాక్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా వీరి బెట్టింగ్ యాప్స్ కంపెనీల వివరాలు.. ఆర్థిక లావాదేవీల వివరాలు కూడా పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేయాలని పోలీసులు డిసైడ్ కావడంతో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన బ్యాచ్లో వణుకు మొదలైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన యూట్యూబర్స్.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు హాజరుకాకపోతే వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. విచారణకు ఎవరెవరు వస్తారు.. ఎవరు డుమ్మా కొడతారు అనేది తెలియాల్సి ఉంది. నోటీసుల అనంతరం సమయం కోరిన వారికి సమయం ఇస్తామన్నారు. కానీ పూర్తిగా హాజరుకాని వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. విచారణ అనంతరం కూడా వీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఆధారాలు సేకరించి అరెస్ట్ చేస్తామని పోలీసులు తేల్చి చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.