Bandi Sanjay Video: వారెవ్వా.. సింగర్‌గా మారిన కేంద్ర మంత్రి.. మోదీని పొగుడుతూ పాట.. వీడియో వైరల్..

Bandi Sanjay song on pm modi: కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ పాటను పాడారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ గా మారింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు,  అభిమానులు భలేగా పాడారంటూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 13, 2025, 12:50 PM IST
  • పాట పాడిన కేంద్ర మంత్రి..
  • ఫిదా అవుతున్న అభిమానులు..
Bandi Sanjay Video: వారెవ్వా.. సింగర్‌గా మారిన కేంద్ర మంత్రి.. మోదీని పొగుడుతూ పాట.. వీడియో వైరల్..

Bandi sanjay song on pm modi video: కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ రాజకీయాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఎల్లప్పుడు పదునైన తన ప్రసంగాలతో కార్యకర్తలలో జోష్ ను నింపుతుంటారు. మరొవైపు అపోసిషన్ పార్టీలు చేస్తున్న ఆరోపణలకు అదే విధంగా కౌంటర్ లు సైతం ఇస్తుంటారు. ఎక్కడ ఏ అవకాశం వచ్చిన కూడా తనదైన  స్టైల్ లో అపోసిషన్ పార్టీలపై విరుచుకుపడుతుంటారు.

Add Zee News as a Preferred Source

పథ్తర్ కా జవాబ్.. ఈట్సే దెంగే అన్నవిధంగా తగ్గా ఫార్ గా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ అంటే.. చాలా మంది కార్యకర్తలకు ప్రత్యేకంగా అభిమానం ఉందని చెప్పుకొవచ్చు. బిడ్డా.. అంటునే ఒకవైపు.. కాంగ్రెస్ ను మరోవైపు బీఆర్ఎస్ ను కూడా తనదైన స్టైల్ లో పదునైన వ్యాఖ్యలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ కొత్తగా సింగర్ గా మారిపోయారు.  

 

ఎప్పుడు పాలిటిక్స్ లో, మరోవైపు ప్రజాసేవలో బిజిగా ఉంటే బండి సంజయ్ సింగర్ గా  మారి అందర్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ ఆయన పాడిన పాట ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.  'నమో.. నమో.. నరేంద్ర మోదీ.. పలుకుతున్నది యువతనాడీ'.. ప్రధానిగా మీరే కావాలంటున్నది మన భరత జాతీ.. అంటూ బండి సంజయ్ పాటను పాడారు.

 అంతేకాకుండా..రామ.. లక్ష్మణ జానకీ.. జైబోలో హనుమానుకి' అంటూ సంజయ్ పాట పాడారు. ఈపాటను ఎప్పుడు పాడారో కానీ.. ఇప్పుడైతే ఈ పాట నెట్టింట తెగ సందడి చేస్తుంది. మొత్తంగా హోలీ, ఉగాదికి ముందు ఈ పాట రావడంతో ప్రస్తుతం అభిమానులు ఖుష్ అవుతున్నారు.

Read more: Hyderabad: హైదరాబాద్‌లోని శివాలయంలో మరో ఘోరం.. ఏకంగా శివలింగంపై కాలుపెట్టి మరీ.. వీడియో వైరల్..

దీనిలో ముఖ్యంగా రాముడు, హనుమంతుడ్ని కీర్తిస్తు కూడా పాట ఉండటంతో ఈ సారి శ్రీరామ నవమి, హనుమాన్ జయంతిలకు ఈ పాట హైలేట్ గా నిలుస్తుందని కార్యకర్తలు అంటున్నారు. మరోవైపు గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం.. ఇలాగే పాటలు పాడుతూ హల్ చల్ చేస్తుంటారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాడిన పాట మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News