)
Central minister bandi Sanjay slams on brs and congress: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జూబ్లిహిల్స్ ఉపఎన్నికల అంశం ప్రస్తుతం సంచలనంగా మారింది. అన్ని రాజకీయ పార్టీలు ఎలాగైన జూబ్లిహిల్స్ పై తమ జెండాను ఎగరవేయాలని శాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. ప్రచారంను కూడా వేగవంతం చేశారు. మరోవైపు జూబ్లిహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ నేపథ్యంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రామ్ చందర్ రావు ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏకీపారేశారు. అదే విధంగా.. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ని అభివృద్ధి చేయలేదన్నారు. మరోవైపు రెండేళ్లుగా కాంగ్రెస్ కూడా జూబ్లీహిల్స్‌కి ఏం చేయలేదన్నారు.
నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య ఘటనలో ఎన్ కౌంటర్ కు గురైన రియాజ్ అంశంపై కూడా మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు చెప్తే ఎన్కౌంటర్ చేస్తారా..?.. అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ కార్యకర్తలను వేధించిన వాళ్లని వదిలేస్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కి చిత్తశుద్ధి లేదని, డ్రగ్స్ కేసు, ఫామ్‌హౌస్ కేసు ఏమైందని ఫైర్ అయ్యారు. MIM మెప్పు పొందేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పని చేస్తున్నాయన్నారు.
జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి అనుకునే MIM.. ఎందుకు బరిలో లేదన్నారు. దేశమంతా కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగే ఎంఐఎం పార్టీ జూబ్లిహిల్స్ లో ఎందుకు పోటీచేయడంలేదో చెప్పాలన్నారు. బీజేపీని గెలిపిస్తే పెద్దమ్మగుడి కట్టిస్తామన్నారు. అదే విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బుద్ది చెప్తామన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook