Telangana MLC Elections: ఈ ఓటములు కాంగ్రెస్ కు బీజేపీకి ఇస్తున్న రంజాన్ గిఫ్ట్..

Telangana MLC Elections: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో ముందు బీజేపీ గెలుపు ఖాయం అనిపించినా.. ఆ తర్వాత కాంగ్రెస్ లీడ్ లోకి రావడంతో ఫలితంపై ఒకింత ఉత్కంఠ నెలకొంది. చివరకు రెండో ప్రాధాన్యత ఓట్లతో తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం గెలవడంతో బీజేపీ శ్రేణులు పండగ చేసుకున్నాయి. ఈ గెలుపును కేంద్ర మంత్రి బండి సంజయ్.. కాంగ్రెస్ కు రంజాన్ గిఫ్ట్ గా అభివర్ణించారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 6, 2025, 08:18 AM IST
 Telangana MLC Elections: ఈ ఓటములు కాంగ్రెస్ కు బీజేపీకి ఇస్తున్న రంజాన్ గిఫ్ట్..

Telangana MLC Elections: తెలంగాణ మూడు ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్, మూడు స్థానాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని రెండు స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తంగా ఉత్తర తెలంగాణలో బండి సంజయ్ అద్భుతమైన స్కెచ్ బాగానే వర్కౌట్ అయింది.ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలో BJP  విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్‌- ఆదిలాబాద్‌- నిజామాబాద్‌- మెదక్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఆ పార్టీ అభ్యర్థి చిన్నమైల్‌ అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అల్ఫోర్స్‌ నరేందర్‌ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలింది. ఇక్కడ కాంగ్రెస్‌ తన సిటింగ్‌ సీటును కోల్పోయింది. ఇప్పటికే ఈ నెల 3న వెలువడిన ఫలితాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా BJP  మద్దతుదారు మల్క కొమరయ్య గెలిచారు. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన రెండు ఎమ్మెల్సీ స్థానాలను BJP  తన ఖాతాలో వేసుకుంది.

Add Zee News as a Preferred Source

మొదటి ప్రాధాన్య ఓట్ల సాధనలో BJP , కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. మూడో స్థానంలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ  కూడా  గట్టిపోటీనిచ్చారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనంతరం BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలచారు. మొత్తం 11 రౌండ్లలో లెక్కింపు కొనసాగగా తొలి రౌండ్‌ నుంచి భారతీయజ జనతా పార్టీ  అభ్యర్థి ఆధిక్యం ప్రదర్శించారు. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది రౌండ్లలో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి కొంత ఆధిక్యం పొందినా మిగతా రౌండ్లలో అంజిరెడ్డి దూసుకెళ్లారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.               

ఫలితాల్లో చేదు అనుభవంతో కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డి లెక్కింపు కేంద్రం నుంచి కంటతడి పెడుతూ బయటకు వెళ్లిపోయారు. బీఎస్పీ అభ్యర్థి ఎలిమినేషన్‌ అనంతరం ఆయన రిటర్నింగ్‌ అధికారితో మాట్లాడుతూ ఓట్ల పరంగా అతి సమీపంలో ఉన్నానని.. మూడో ప్రాధాన్య ఓట్లను లెక్కించాలని కోరారు. నిబంధనల ప్రకారం ద్వితీయ స్థానంలో ఉన్న వారిని ఎలిమినేట్‌ చేసి ఆ ఓట్లను లెక్కిస్తామని.. అందులో నిర్ణీత కోటా ఓట్లు రాకుంటే ఎన్నికల సంఘం ఆదేశాలకనుగుణంగా నడుచుకుంటామని అధికారిణి సమాధానమిచ్చారు. దీంతో ఓటమి ఖాయమని భావించిన నరేందర్‌రెడ్డి కంటతడి పెట్టుకుని బయటకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్.. ఈ గెలుపు..కాంగ్రెస్ పార్టీకి రంజాన్ కానుకగా అభివర్ణించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఛీ కొట్టిన విషయం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైందన్నారు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News