Charminar Plaster Falls Down: వేసవికాలంలో అకాల వర్షం తెలంగాణనను అతలాకుతలం చేసింది. జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాహనదారులతోపాటు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా అకాల వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో కొన్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఖైరతాబాద్‌లో ఓ భారీ చెట్టు కారుపై కూలిపోవడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇక నగరానికి తలమానికమైన చారిత్రక చార్మినార్ పాక్షికంగా దెబ్బతింది. భారీ వర్షానికి చార్మినార్ పెచ్చులు ఊడిపోయాయి.
Also Read: Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. వర్షానికి కూలిన చార్మినార్ పెచ్చులు
పాతబస్తీలో గంటపాటు భారీ వర్షం కురిసింది. అత్యధిక వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదైంది. అయితే భారీ వర్షానికి చార్మినార్‌లోని ఓ ప్రాంతం దెబ్బతింది. వర్ష ప్రభావం కారణంగా చార్మినార్‌లోని ఒక మీనార్‌లో డిజైన్ కూలిపోయింది. వాటి పెచ్చులు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ముందు పడ్డాయి. మీనార్‌లోని చివరి భాగంలో కొంత డిజైన్లు రాలిపడడంతో ఆందోళన నెలకొంది. అయితే పెచ్చులు పడినప్పుడు ఆ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. అమ్మవారి ఆలయం ముందు చార్మినార్ శిథిలాలు పడ్డాయి. అయితే నీటిలో ఆ శిథిలాలు కరిగిపోయాయి.
Also Read: Adilabad Airport: తెలంగాణకు భారీ గుడ్‌న్యూస్.. మరో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
గత బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం చార్మినార్‌కు పురాతన పద్ధతిలో మరమ్మతులు చేయించింది. అంతేకాకుండా అక్కడి ఫుట్‌పాత్ ఆధునీకరించి సర్వాంగ సుందరంగా తయారుచేసింది. అక్కడ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి చార్మినార్ కట్టడాన్ని పరిరక్షించింది. అయితే ఏం జరిగిందో కాదు చార్మినార్‌లోని ఓ భాగం కూలిపోవడం చర్చనీయాంశంగా మారింది. కూలడంపై పురావస్తు శాఖ అధికారులతోపాటు పర్యాటక శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. నిర్మాణం కూలిన సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు.
గాలివానతో కూడిన భారీ వర్షానికి ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట మార్గంలో భారీగా వాహనాలు స్తంభించాయి. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే రహదారిపై ఓ భారీ వృక్షం కూలి కారుపై పడింది. ప్రమాదంలో ప్రాణాపాయం చోటు చేసుకోకపోయినా ఖైరతాబాద్ పంజాగుట్ట రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జోయల్ డేవిడ్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. చెట్టును తొలగించే పనులు డీఆర్ఎస్ బృందం వేగవంతంగా చెట్టును కట్ చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరణ చేశారు.
రైల్వే బ్రిడ్జి కింద చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
మలక్‌పేట్ వద్ద ఆగిపోయిన బస్సు. వరద నీటిలో చిక్కుపోయిన ఆర్టీసీ బస్సు. అతి కష్టంగా బయటకు వచ్చిన ప్రయాణికులు. గాలివానతో కూడిన భారీ వర్షానికి ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట మార్గంలో భారీగా వాహనాలు స్తంభించాయి. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే రహదారిపై ఓ భారీ వృక్షం కూలి కారుపై పడింది. సంఘటన స్థలానికి ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జోయల్ డేవిడ్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. చెట్టును తొలగించే పనులు డీఆర్ఎస్ బృందం వేగవంతంగా చెట్టును కట్ చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరణ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









