Mutton Very Cheap in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చాలామంది మాంసప్రియులు చికెన్ తినడం మానేశారు. వారంతా మటన్ లేదా చేపలు తింటున్నారు.. ఆదివారం రాగానే చికెన్ తినే వారు ఇప్పుడు మటన్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటి ధరలు ఆకాశాన్నంటాయి. అయినా కానీ కొనుగోలు చేయలేక తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో కొన్ని లక్షల మంది కోళ్లు మృతి చెందాయి. అంతేకాదు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషులకు కూడా సోకడంతో ప్రజలు తినడానికి బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో చికెన్ ధరలు కూడా ఒక్కసారిగా పడిపోయాయి. వ్యాపారస్తులు కూడా లబోదిబోమంటున్నారు. అయితే బర్డ్ ఫ్లూ తగ్గే వరకు వీటి విక్రయాలు పెరిగే అవకాశం లేదు. మటన్ కొనడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మటన్ కేవలం రూ.500 లోపే దొరుకుతుంది అని చాలా మంది ఇక్కడికి క్యూ కడుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క లేకుండా ముద్ద దిగలేని పరిస్థితి చాలా మందిలో ఉంది. మటన్ ఆరోగ్య కరం ఇందులో ఐరన్ కూడా ఉంటుంది. అంతేకాదు ఏ పెళ్లిళ్లు పార్టీలు చేసుకున్న మటన్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇదివరకు చికెన్ లేనిదే రోజు గడిచేది కాదు. అయితే బర్డ్‌ఫ్లూ కారణంగా చికెన్ తినే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది . వీరంతా మటన్ లేదా చేపలు కొనుగోలు చేస్తున్నారు.
అయితే, ఒక్కసారిగా మటన్ ధరలకు రెక్కలు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ.1000 దాటింది. మరికొన్ని ప్రాంతాల్లో రూ.800 కు కేజీ మటన్ విక్రయిస్తున్నారు. అయితే ముక్క లేనిదే ముద్ద దిగలేనివారు కచ్చితంగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే మరికొందరు చేపలు తీసుకుంటున్నారు వాటి ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లోనే ఈ ప్రాంతంలో మటన్ కేవలం రూ.500 లోపు కేజీ దొరుకుతుంది. ఇది ఎక్కడో కాదు చెంగిచెర్ల. ఈ మార్కెట్లో కేజీ మటన్ ధర రూ. 500 లోపే ఉంటుంది.
ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. ఈ రాశికి ఈరోజు తిరుగేఉండదు, ఏం లక్కు చేసుకున్నారు?
ఇదీ చదవండి: SLBC Tunnel: ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్ డాగ్స్.. మరికొద్ది క్షణాల్లో...
ఇక్కడ లైవ్ మేకలు కూడా విక్రయిస్తారు. ఏ పెళ్లిళ్లు, ఫంక్షన్ ఉన్నా కానీ ఇక్కడ మటన్ కొనుగోలు చేస్తారు. అంతేకాదు ఇక్కడ మేకలను కట్ చేసి కూడా విక్రయిస్తారు. ఇక బోటీ, లివర్ కూడా ఇక్కడ కట్ చేసి అందుబాటులో పెడుతున్నారు. కేవలం రూ.150 లోపు బోటి లభిస్తుంది. ఇక ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఆదివారం రాగానే కచ్చితంగా ఈ మార్కెట్ కి వెళ్తారు. అంతేకాదు ఇక్కడ మేకలు హోల్ సేల్ ధరలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఫంక్షన్లు ఉన్నవారు కచ్చితంగా చెంగిచెర్ల మార్కెట్ కు వెళ్లాల్సిందే. ఎక్కువ మొత్తంలో తక్కువ ధరకే మేకలను విక్రయిస్తారు. అయితే మేకల పెంపు కూడా ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయింది. మరోవైపు బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టించడంతో ఒక్కసారిగా మేక మాంసం ధర విపరీతంగా పెరిగిపోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









