CM Kcr on PM Modi: ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. మోదీ చెప్పేది ఒకటి, చేసేది మరొకటని విమర్శించారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉన్నా.. వాడే తెలివి కేంద్రానికి లేదని కేసీఆర్ (CM Kcr) ఆరోపించారు. భాజపా పాలకుల అవినీతి చిట్టా తన దగ్గర ఉందని.. దమ్ముంటే తనని జైలుకు పంపాలని కేసీఆర్ సవాల్ విసిరారు.  మీరు జైల్లో పెట్టుడు కాదు..మేమే మిమ్మిల్ని జైలుకు పంపుతామని కేసీఆర్ అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోసారి  కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు కేసీఆర్. మిషన్‌ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి ప్రధానిని (PM Modi) పిలిస్తే...అన్ని అబద్దాలే చెప్పారని కేసీఆర్ ఆరోపించారు. ఈ విషయంపై చర్చకు రావాలన్నా భాజపా నేతలు రారని ఆయన ఎద్దేవా చేశారు. విద్యుత్‌ సంస్కరణలపై కేంద్రం తీసుకొచ్చిన ముసాయిదా బిల్లులోని ఆంశాలను ఆయన వివరించారు. సాగు కోసం నూతన విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకూడదనేది కేంద్ర విధానమని ఆయన మండిపడ్డారు. 


విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించాలనేది కేంద్రం ఉద్దేశమని ఆయన అన్నారు.  రఫేల్‌ జెట్‌ విమానాల కొనుగోలులో గోల్‌మాల్‌ జరిగిందని ఆరోపించారు. భాజపా (BJP) అవినీతి గురించి దిల్లీలో పంచాయితీ పెడతానని ఆయన అన్నారు. భాజపా తన సిద్ధాంతాలు గాల్లో కలిపేసిందని విమర్శించారు.  ఎన్నికల్లో గెలవకపోయినా పాలించే సిగ్గులేని పార్టీ భాజపా అని కేసీఆర్ ధ్వజమెత్తారు. 


Also Read: Bandi Sanjay: కేసీఆర్‌లో ఆ భయం మొదలైంది.. అందుకే ఈ డ్రామాలు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook