Konijeti Rosaiah: రోశయ్య పార్థివదేహానికి సీఎం కేసీఆర్‌ నివాళి..రేపు కొంపల్లిలో అంత్యక్రియలు..

Konijeti Rosaiah: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. రోశయ్య అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 01:33 PM IST
  • రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్‌ నివాళి
  • ప్రభుత్వ లాంఛనాలతో రేపు అంత్యక్రియలు
  • మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటన
Konijeti Rosaiah: రోశయ్య పార్థివదేహానికి సీఎం కేసీఆర్‌ నివాళి..రేపు కొంపల్లిలో అంత్యక్రియలు..

Konijeti Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య(Konijeti Rosaiah) పార్థివదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. కేసీఆర్‌తో పాటు పలువురు నాయకులు రోశయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అమీర్‌పేటలో ఉన్న రోశయ్య నివాసానికి వెళ్లిన కేసీఆర్‌(CM KCR).. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మూడురోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. 

Also Read: Konijeti Rosaiah Death : ఒక శకం ముగిసింది..రోశయ్య ఒక యోగిలా ప్రజాసేవ చేశారన్న చిరంజీవి, బాలకృష్ణ

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రోశయ్య శనివారం (డిసెంబర్ 4) ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను స్టార్ ఆసుపత్రికి తరలించగా... అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస (Konijeti Rosaiah passes away)విడిచారు. రేపు కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు రోశయ్య అంత్యక్రియలు(Rosaiah funerals) జరగనున్నాయి. ఆదివారం ఉదయం వరకు రోశయ్య నివాసంలోనే ఆయన భౌతికకాయం ఉంచనున్నారు. అనంతరం ప్రజల సందర్శనార్థం.. గాంధీభవన్‌కు తరలిస్తారు. ఆ తర్వాత గాంధీభవన్ నుంచి కొంపల్లి వరకు అంతిమయాత్ర కొనసాగనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News