)
Minister Azharuddin gets Public Enterprises and Minorities Welfare Portfolios: తెలంగాణలో ప్రస్తుతం జూబ్లిహిల్స్ ఉపఎన్నికల సమరంహాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీలు కూడా జూబ్లిహిల్స్ బై పోల్స్ లో తమ సత్తాచాటాలని ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తమదైన స్టైల్ లో పావులు కదుపుతు ముందుకు వెళ్తున్నాయి.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు.
అజరుద్దీన్ చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. తాజాగా.. మంత్రి అజారుద్దీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలకమైన శాఖలను కేటాయించింది. ప్రస్తుతం సీఎం రేవంత్ దగ్గర ఉన్న ప్రభుత్వ రంగం సంస్థలతో పాటు మైనార్టీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు.
ఇంతకుముందు మైనార్టీ శాఖ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ఈ శాఖను తాజాగా అజారుద్దీన్‌కు కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే.. హోంశాఖ కోసం అజరుద్దీన్ ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఏశాఖ కేటాయిస్తారనే దానిపై విపరీతంగా చర్చలు జరిగాయి. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం మంత్రి అజరుద్దీన్ కేటాయించిన రెండు శాఖలతో అందరికి ఒక క్లారిటీ వచ్చినట్లైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.