)
Revanth Reddy: ఈ నెల 17న నిజామాబాద్ జిల్లాలో రౌడీ షీటర్ రియాజ్ చేతిలో అత్యంత పాశవికంగా హత్య చేయబడ్డారు కానిస్టేబుల్ ప్రమోద్. అయితే ఈ క్రమంలో కానిస్టేబుల్ ను వెనక నుంచి కత్తితో పొడవడం వల్ల ప్రమోద్ ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత నిందితుడిని న్యాయస్థానం ప్రవేశపెట్టే ముందు హాస్పిటల్స్ లో ఫిజికల్ ఫిట్ నెస్ కు సంబంధించిన అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళితే.. అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ చేతుల్లోంచి తుపాకీ లాక్కునే ప్రయత్నం చేయగా.. పోలీసులు అతని గత నేర చరిత్ర, ప్రవృత్తిని దృష్టిలో పెట్టుకొని అతన్ని ఎన్ కౌంటర్ చేసారు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ వివరణ ఇచ్చారు. నిజామాబాద్ పట్టణంలో రియాజ్ తరుచుగా మహిళల మెడలో గొలుసులు దొంగతనాలకు పాల్పడుతూ అరాచక వాదిగా పేరు పొందాడు. ఈ క్రమంలో ఎంతో మంది మహిళలు మరణించారు. అటు బైకులు దొంగ తనం చేసిన మహారాష్ట్రలో అమ్మేవాడు. ఆ వచ్చిన డబ్బులతో జల్సాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని ఎన్ కౌంటర్ చేశారు.
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy participates in Police Flag Day Parade at Police Martyrs Memorial, Goshamahal, Hyderabad https://t.co/EKN8uC9AFz
— Telangana CMO (@TelanganaCMO) October 21, 2025
తాజాగా రియాజ్ దాడిలో మృతి చెందిన ప్రమోద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అంతేకాదు 300 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామి ఇచ్చారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ. 16 లక్షలు.. పోలీసు వెల్ఫేర్ రూ. 8 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. పోలీసుల సంక్షేమాన్ని ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.