CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో 10ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందంటూ హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానంటూ స్పష్టం చేశారు ఆయన. శనివారం మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఈసారి బీఆర్ఎస్ మీదున్న వ్యతిరేకతతో కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లేసి గెలిపించారు. రెండోసారి కూడా మా మీదున్న ప్రేమతో మేము చేసిన డెవలప్ మెంట్ చూసి ప్రజలు ఓట్లు వేస్తారని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామని మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సంక్షేమ పథకాల లబ్దిదారులే తమ ఓటర్లు అని..మా పనిమీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. స్టేచర్ కాదు..స్టేట్ ప్యూచర్ తమకు ముఖ్యమని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా కోటి మంది మహిళలకు లబ్ది చేకూరుస్తారని మరోసారి స్పష్టం చేశారు. వాళ్లు ఇప్పుడు మౌనంగా ఉన్నా..తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కే ఓట్లు వేస్తారని తెలిపారు.
Also read: Chameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదం
25లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ చేశామని..కోటి మంది మహిళలకు లబ్ది చేకూరుస్తామని తెలిపారు. గతంలో ఎన్నికలకు ముందు నేనేం చెప్పానో అదే జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా నేను చెప్పబోయేది జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని..వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు వందశాతం బకాయిలు చెల్లిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఆదాయాన్ని పెంచి పేదలకు పంచడమే మా విధానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









