)
cm Revanth reddy controversy comments on Hindu deities: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు రెండెళ్లలో కాంగ్రెస్ ఏవిధంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లిందో నేతలు చెప్పాలన్నారు. బడి , గుడి, రచ్చ బండ, స్మశానం ఇలా ప్రతి చోట ఎక్కడ గ్యాదరింగ్ జరిగిన అక్కడ కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాల గురించి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తమ అపోసిషన్ పార్టీలపై మండిపడ్డారు. తాను.. ముఖ్యమంత్రి కాకముందు మస్తు మంది మీద నాకు కోపం ఉండేదని, రూంలో వేసి కట్టె తీసుకొని అలిసిపోయే దాకా కొట్టాలని ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వారిని కొట్టి ఎనర్జీ ఎందుకు లాస్ కావాలని వదిలేశానన్నారు.
హిందూ దేవుళ్ళ పైన రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
పెళ్లి కానోడికి హనుమంతుడు ఉన్నడు
రెండు పెళ్ళిలు చేసుకునే వాళ్లకు ఒక దేవుడు ఉన్నడు
మందు తాగేటోళ్లకు ఇంకో దేవుడు అని ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉన్నాడు – సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/qk86UxwPRg
— Telugu Scribe (@TeluguScribe) December 2, 2025
అంతేకాకుండా.. హిందూ దేవతలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెళ్లి కానోడికి హనుమంతుడు, రెండు పెళ్ళిలు చేసుకునే వాళ్లకు ఒక దేవుడు ఉన్నడు, మందు తాగేటోళ్లకు ఇంకో దేవుడు ఉన్నాడని.. ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉన్నాడంటూ సీఎం రేవంత్ రెడ్డి వేటకారంగా మాట్లాడారు. అదే విధంగా.. మోడీని బుల్లెట్ ట్రైన్ ఇస్తవా.. సస్తవా అని అడగడానికి ఢిల్లీ పోతున్ననంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు 90 శాతం మందికి అందాయన్నారు.
ఎన్ని కల కోడ్ కారణంగా కొంత మందికి ఇవ్వలేదన్నారు. ఎన్నికల కోడ్ తర్వాత చీరల పంపిణి ఉంటుందన్నారు. అదే విధంగా.. ఉస్మానియా యూనివర్సిటీకి డిసెంబర్ 7వ తేదీన వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు అయినా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఎంతో మంది రాజకీయ దురంధరుల్ని ఉస్మానియా ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై కేసులు పెడితే భయపడేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రైవేట్ సంస్థల్లో పని చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవని.. ఈ నేపథ్యంలో ఎప్పుడో మూతపడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందిని ఆదుకున్నరన్నారు. పత్రికను తిరిగి నడిపించాలనే ఉద్దేశ్యంతో బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా కొంత మంది కాంగ్రెస్ పార్టీ నేతలను తీసుకున్నారన్నారని స్పష్టం చేశారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు.
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి రూమ్ ల పడేసి కొట్టాలనుండే వ్యాఖ్యలను కొంత మంది నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించిన అప్పట్లో కీలక బీఆర్ఎస్ నేతల్ని కొట్టాలనుందా సార్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.