)
cm revanth reddy emotional tweet on Haryana ips puran kumar suicide incident: హర్యానాకు చెందిన సీనియర్ ఐపీఎస్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) వై పురాణ్ కుమార్ ఇటీవల తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముఖ్యంగా రోహ్ తక్ ఎస్పీ నరేంద్ర బిజార్ణియా, హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్ ల కులంపేరుతో వేధింపుల కారణంగా చండీగఢ్ లో ఆయన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నారు.
ఈ మేరకు చనిపోవడంకు ముందు ఆయన ఒక సూసైడ్ నోట్ లో తెలిపారు. వైపురాణ్ కుమార్ సతీమణి అమ్నీత్ కుమార్ దీనిపై పోలీసు శాఖ వారు తగిన విధంగా కేసుల్ని నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తర్వాత పోస్ట్ మార్టం విషయంలో కూడా పలు సందర్భాల్లో గందర గోళంకు గురిచేసేలా ఇబ్బందులు పెట్టారన్నారు.
ఈ క్రమంలో తాజాగా.. రోహ్ తక్ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాపైవేటు వేయడంతో పాటు, హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్ ను ఆ స్థానంనుంచి తప్పించారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసుల్ని నమోదు చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సైతం.. పూరన్ సింగ్ సతీమణికి తన బాధను వ్యక్తపరుస్తూ , యావత్ దేశం అండగా ఈ ఘటనలో మీకు ఉంటుందని లేఖను రాశారు.
ఈ క్రమంలో తాజాగా.. తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఏపీకి చెందిన పూరణ్ సింగ్ ఐపీఎస్ హర్యానాలో ఆత్మహత్యకు పాల్పడటంపై తీవ్ర భావోద్వేగంకు గురయ్యారు.ఈ క్రమంలో ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
అణగారిన వర్గాలపై జరిగిన దారుణాలను తీవ్రంగా ఖండించారు. ఒక ఐపీఎస్ అధికారిని చనిపోయే విధంగా.. బలవంతంగా కులం పేరుతో జరిగిన దాడులకు ఇది స్పష్టమైన ఉదాహరణ అని ముఖ్యమంత్రి అన్నారు. ఏడీజీపీ స్థాయి అధికారిని కులం పేరుతో వేధింపులకు గురౌతే.. సామాన్య ప్రజల దయనీయ జీవన పరిస్థితులను అర్థం చేసుకోవచ్చని సీఎం పేర్కొన్నారు.అణగారిన వర్గాల పట్ల ద్వేషం సమాజాన్ని విషపూరితం చేస్తుందని హెచ్చరించారు.
ఈ రకమైన అవమానకరమైన సంఘటనలు రాజ్యాంగం, సమానత్వం, న్యాయంపై ప్రజలను విశ్వాసం కోల్పోయేలా చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలపై ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని సీఎం పిలుపునిచ్చారు. ఇది ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ పై జరిగిన దాడి మాత్రమే కాదు, మొత్తం దేశం, ప్రజలు దీనిని తీవ్రమైన సమస్యగా పరిగణించాలని సీఎం పిలుపునిచ్చారు.
మృతుల కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఒక వ్యక్తి సాధారణ పౌరుడైనా, ఉన్నత పదవిలో ఉన్నా, దళిత సమాజానికి చెందినవాడైనా, అతని హోదాతో సంబంధం లేకుండా అన్యాయం, అమానవీయతను సహించకూడదని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు.
మరోవైపు.. వేధింపుల ఘటనలతో సీనియర్ అధికారి పురణ్ సింగ్ చనిపోవడం బాధకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. హర్యానా డిజిపి శత్రుజిత్ కపూర్ సహా ఎనిమిది మంది సీనియర్ అధికారుల మూలంగా.. కుల ఆధారిత వివక్ష, బహిరంగ అవమానాలు, మానసిక వేధింపులు, దౌర్జన్యాలను భరించలేక తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పూరణ్ కుమార్ ఐపీఎస్ తన సూసైడ్ నోట్లో స్పష్టంగా పేర్కొన్నారు.
సూసైడ్ నోట్ ఆధారంగా బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని పూరణ్ కుమార్ భార్య అమ్నీత్ Ias స్థానిక పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారని డిప్యూటీ సీఎం తెలిపారు. స్వాతంత్రం సాధించి 78 సంవత్సరాలు గడిచిన దేశంలో అతున్నత సర్వీసులు అయిన ఐపీఎస్ లో ఇంకా కుల వివక్ష, ఆత్మహత్య వంటి సంఘటనలు చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook