cm revanth reddy on huc land controversy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీలో భూముల వివాదం రచ్చగా మారింది. దీనిపై ఇప్పటికే అపోసిషన్ పార్టీలు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాయి. హెచ్‌సీయూ విద్యార్థినేతలు, నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక దశలో హెచ్‌సీయూ దగ్గర లాఠీ చార్జీ చోటు చేసుకుంది. రాత్రికి రాత్రే.. ఫ్లడ్ లైట్ల వెలుతురుతో అధికారులు హెచ్‌సీయూ భూములను చదును చేయడం కాంట్రవర్సీగా మారింది. దీనిపై తెలంగాణలో రాజకీయంగా కూడా హట్ టాపిక్ గా మారింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ ఘటనను ఖండించారు. దీనిపై ఎందుకే మేధావులు మాట్లాడటంలేదని, విద్యా కమిషన్ లో వివిధ హోదాల్లో ఉన్న వారు దీనిపై ఎందుకు స్పందించడంలేదన్నారు. ఒకవేళ స్పందించకుంటే.. మాత్రం హెచ్‌సీయూ 400 ఎకరాలభూముల్ని ప్రైవేటు పరం చేసేందుకు అంగీకరించినట్లే అన్నారు. ఈ క్రమంలో తాజాగా.. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. హెచ్‌సీయూలో చదును చేస్తున్న 400 ఎకరాల భూములను.. 21 ఏళ్ల క్రితం ప్రైవేటు సంస్థకు అప్పగించిందన్నారు.
దీనిలో హెచ్‌సీయూకు కేటాయించిన భూమికానీ, చెరువులు కానీ, ఒక్క అంగుళం కూడా లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో హెచ్‌సీయూ భూముల వివాదంపై విద్యార్థులు మండిపడుతున్నారు. వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొవాలని హెచ్చరించారు. ఒక వేళ ప్రభుత్వం దీనిపైన వెనక్కు తగ్గకపోతే.. ఆమరణ దీక్ష చేస్తామంటున్నారు. ఈ క్రమంలో హెచ్‌సీయూలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం హెచ్ సీయూలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీగా విద్యార్థులు కూడా అక్కడకు చేరుకుని నినాదాలు చేస్తున్నారు.
ఇప్పటికే పలువురు విద్యార్థి నాయకుల్ని, స్టూడెంట్స్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. దీనిపైన కొంత మంది రాజకీయాలు చేస్తున్నారని కూడా ఇన్ డైరెక్ట్ గా ఘటనపై స్పందించిన నేతల్ని ఉద్దేశించి పొన్నం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కావాలిస్తే మరోసారి హెచ్ సీయూ భూములపై పునఃపరిశీలన కూడా చేసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









