)
cm revanth reddy govt appoints shivadhar reddy as Telangana new dgp: తెలంగాణలో డీజీపీగా ప్రస్తుతం పనిచేస్తున్న జితేందర్ ఈనెలా ఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్న శివధర్ రెడ్డిని తెలంగాణకు నూతన డీజీపీగా నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
1994 బ్యాచ్ ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డి.. గతంలో మావోయిస్టుల్ని అణచివేయడంతో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో శివధర్ రెడ్డి అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి శివధర్ రెడ్డికి డీజీపీగా బాధ్యతలు అప్పగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు.
శివధర్ రెడ్డి ప్రస్థానం ఇదే..
హైదరాబాద్‌లో జన్మించిన శివధర్ రెడ్డిది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ గ్రామం. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్‌లోనే ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఎల్ ఎల్ బీని ఉస్మానియాలో పూర్తి చేశారు. ఆ తర్వాత సివిల్స్ కోసం శ్రమించి చివరకు.. 1994లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు.
గతంలో ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పని చేశారు. గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేసి తనదైన మార్కు చూపించారు.
అదే విధంగా.. 2014-16 మధ్య తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 లో నయిం ఎన్ కౌంటర్ లో కీలక పాత్రపోషించారు. యూఎన్వో.. శాంతి పరిరక్షణ దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావోలో కూడా శివధర్ రెడ్డి పనిచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా సేవలందించారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన తిరిగి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook