)
Accreditation cards Telangana journalists: తెలంగాణ జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. జర్నలిస్టులు ఎంతగానో ఎదురుచూస్తోన్న మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీపై ఏకంగా జీవోను సైతం జారీ చేసింది. ఇప్పటికే జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని పలు సందర్భాల్లో మంత్రులు తెలిపారు. ఇప్పటికే అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి ముగియగా.. ప్రభుత్వం పలు మార్లు వాటి వ్యాలిడిటీని పొడిగిస్తూ వచ్చింది. దీంతో, నూతన కార్డులు మంజూరు చేయాలని జర్నలిస్టు సంఘాల నుంచి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నూతనంగా అక్రిడిటేషన్ కార్డులపై జీవోను జారీ చేసింది. దీంతో పాటు అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకి అక్రిడిటేషన్ కార్డు అందేలా చేయడంతో పాటు, ఇళ్ల స్థలాల అంశంపై కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ, 'తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025'ను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో (G.O.Ms.No.252) జారీ చేసింది. ఈ క్రమంలో.. కొత్త నిబంధనల ప్రకారం..
1. అక్రెడిటేషన్ కమిటీల కాలపరిమితి:
రాష్ట్ర స్థాయి (SMAC) , జిల్లా స్థాయి (DMAC) అక్రెడిటేషన్ కమిటీల పదవీ కాలం రెండేళ్లుగా నిర్ణయించారు. అదే విధంగా కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పాతవే కొనసాగుతాయి.
2. అక్రెడిటేషన్ కార్డు, మీడియా కార్డు:
* అక్రెడిటేషన్ కార్డు: ఇది ప్రభుత్వ సమాచారాన్ని సేకరించేందుకు రిపోర్టర్లకు గుర్తింపుగా ఉపయోగపడుతుంది.
* మీడియా కార్డు: డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చే ఈ కార్డులు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొందేందుకు మాత్రమే పనికివస్తాయి.
3. డిజిటల్ మీడియాకు తొలిసారి నిబంధనలు:
డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రెడిటేషన్ ఇవ్వాలంటే సదరు వెబ్‌సైట్‌కు గత ఆరు నెలల్లో నెలకు కనీసం 5 లక్షల మంది విజిటర్స్ (Unique Visitors) ఉండాలి. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ మీడియా కేటగిరీలో గరిష్టంగా 10 కార్డులు మాత్రమే ఇస్తారు.
4. ఎలిజిబిలిటీ వివరాలు:
* న్యూస్ పేపర్లు: కనీసం 2,000 ప్రతులు పంపిణీ అవుతున్న దినపత్రికలే అక్రెడిటేషన్‌కు అర్హులుగా ప్రభుత్వం జీవోలో తెలిపింది. దీనిలో PRGI రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
* ఎలక్ట్రానిక్ మీడియా: శాటిలైట్ ఛానళ్లు 50% వార్తా కంటెంట్‌ను కలిగి ఉండాలి. లోకల్ కేబుల్ ఛానళ్లు రోజుకు కనీసం 3 బులెటిన్లు టెలికాస్ట్ చేయాలి.
*జర్నలిస్టుల అర్హత: స్టేట్ లెవల్ అక్రెడిటేషన్ కోసం డిగ్రీ విద్యార్హత లేదా ఐదేళ్ల అనుభవం ఉండాలి.
•నియోజకవర్గ, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి.
5. ఫ్రీలాన్స్ & వెటరన్ జర్నలిస్టులు:
15 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రీలాన్సర్లు, 30 ఏళ్ల అనుభవంతో పాటు 58 ఏళ్లు నిండిన వెటరన్ జర్నలిస్టులు కూడా కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కమిటీల నిర్మాణం:
* రాష్ట్ర కమిటీ (SMAC): మీడియా అకాడమీ చైర్మన్ చైర్మన్‌గా, ఐఅండ్పిఆర్ కమిషనర్ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో వివిధ జర్నలిస్ట్ యూనియన్ల ప్రతినిధులు, పీసీఐ సభ్యులు ఉంటారు. జిల్లా కమిటీ (DMAC): జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీపీఆర్వో మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
నిబంధనల ఉల్లంఘన చేస్తే చర్యలు:
అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేసినా, తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కార్డులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. పోగొట్టుకున్న కార్డుల స్థానంలో డూప్లికేట్ కార్డు కోసం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా పలు నిబంధనలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీచేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి