)
cm revanth reddy key instructions to higher officials on Heavy rains: రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా నిన్నటి నుంచి తెలంగాణలో వరుణుడు నాన్ స్టాప్ గా బాదేస్తున్నాడు. బైటకు వెళ్లాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. రోడ్లన్ని చెరువుల్ని తలపిస్తున్నాయి. కాలనీల్లో, లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరువచ్చి చేరింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు మరింతగా వానలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికల్ని జారీ చేసింది.
మరోవైపు బంగాళ ఖాతంలో ద్రోణి, వాయుగుండంగా మారే చాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎస్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న సీఎం ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ భారీ వర్షాలతో చిగురుటాకులా వణికిపోతుంది. రోడ్లలో భారీగా నీరుచేరడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా అధికారులు చర్యలు తీసుకొవాలని సూచించారు.
హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ఆ దిశగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని సీఎస్ ను ఆదేశించారు.
ఇప్పటికే ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోంను ఇవ్వాలని పోలీసు శాఖ వారు కోరారు. మరోవైపు రానున్న రెండు నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరికలతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని సీఎం రేవంత్ సూచించారు. ముఖ్యంగా అంటు వ్యాధులు ప్రబలే చాన్స్ ఉందని కూడా పలు సూచనలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook