CM Revanth Reddy: అదే ప్రధాని మోదీకి మరణశాసనం.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

CM Revanth Reddy Comments On PM Modi: తెలంగాణలో కుల గణన ప్రధాని మోదీకి మరణశాసనం రాయబోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో తెలంగాణ మోడల్‌పై చర్చ జరుగుతోందన్నారు. మన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 15, 2025, 05:30 PM IST
CM Revanth Reddy: అదే ప్రధాని మోదీకి మరణశాసనం.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

CM Revanth Reddy Comments On PM Modi: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సీఎల్పీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని అన్నారు. సన్న బియ్యం పథకం ఒక అద్భుతం అని.. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్న బియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకమని అన్నారు. భూ భారతిని రైతులకు చేరవేయాలన్నారు. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచిందని.. క్షేత్రస్థాయిలో నిజమైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలని చెప్పారు. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించామని అన్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చామని తెలిపారు. ఇది మన ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనమని అన్నారు.

Add Zee News as a Preferred Source

సంక్షిష్లమైన SC ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క  ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రేపటి నుంచి జూన్ 2వ తేదీ వరకు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ప్రతీ గ్రామం తిరిగేలా ప్రణాళిక రూపొందించుకోవాలని.. తాను కూడా మే 1వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ప్రజలతో మమేకం అయ్యేందుకు సమయం కేటాయిస్తానని వెల్లడించారు.

HCU భూములపై ఏఐతో ప్రతిపక్షం అబద్దపు ప్రచారం చేసిందని.. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటివరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి విమర్శలు చేశారని.. ఇప్పుడు ఏకంగా మోదీనే రంగంలోకి దిగారని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ స్కీమ్స్‌తో ప్రధాని మోదీ ఊక్కిరి, బిక్కిరి  అవుతున్నారని.. వర్గీకరణ ఆయనకు గుదిబండగా మారిందని అన్నారు. కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోందంటూ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో తెలంగాణ మోడల్‌పై చర్చ జరుగుతోందని.. అందుకే ఇక్కడ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలని బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు.

పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుందని నాయకులతో రేవంత్ రెడ్డి అన్నారు. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదని చెప్పారు. మళ్లీ మన ప్రభుత్వం రావాలంటే.. ఇప్పటి నుంచే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.  

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. అర్ధగంట పాటు అతలాకుతలం

Also Read: Tariff war-Investors: ఎంత పని చేశావ్‌ ట్రంప్‌.. నీ వల్ల నిద్ర కూడా పట్టడంలేదు.. ఇన్వెస్టర్ల షాకింగ్ కామెంట్స్..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News