BC Garjana: నేడు దేశ రాజధాని హస్తినలో కాంగ్రెస్ బీసీ ధర్నా..

BC Garjana: బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఢిల్లీలో ధర్నాకు బీసీ సంఘాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బీసీ సంఘాల నేతలు ఢిల్లీ తరలివెళ్లారు. నిన్న సాయంత్రమే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ ఆందోళనలో పాల్గొనేందుకు ఢిల్లికి చేరుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 2, 2025, 09:15 AM IST
BC Garjana: నేడు దేశ రాజధాని హస్తినలో కాంగ్రెస్ బీసీ ధర్నా..

BC Garjana: స్థానిక ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొననున్నారు.

Add Zee News as a Preferred Source

అయితే పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్  పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.  అదే విధంగా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ కూడా ఈ ఆందోళనలో పాల్గొనడం లేదని తెలుస్తోంది.  బీసీ సంఘాల నేతలు స్వయంగా వెళ్లి ఈ రెండు  పార్టీల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. అయినా ఈ రెండు పార్టీల నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం.

అయితే బీజేపీ మాత్రం.. బీసీ ల్లో ముస్లిమ్స్ ను చేర్చడాన్ని తప్పు పడుతుంది. ముస్లిమ్స్ ను బీసీ జాబితా నుంచి తొలిగిస్తే.. బిల్లుకు మద్ధతు ఇస్తామని భారతీయ జనతా పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ రోజు పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్ సభలో కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు తమ ఎంపీలు పార్లమెంట్ కు తప్పనిసరిగా హాజరు కావాలని విప్ జారీ చేసింది. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి నేతలు కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే కదా.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News