CM Revanth reddy: కేసీఆర్‌తోనే బీఆర్ఎస్ పనైపోయింది..!.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

cm Revanth reddy fires on kcr and ktr: ఇప్పటి వరకు మాగంటీ సునీతను గెలిపించాలని మాజీ సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా ప్రజల్ని కోరలేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు . దీన్ని బట్ట కొడుకు ,అల్లుడు మీద కేసీఆర్ కు ఎలాంటి  అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చని సెటైర్ లు వేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 9, 2025, 02:01 PM IST
  • మాజీ సీఎంపై మండిపడిన రేవంత్ రెడ్డి..
  • ప్రజలు బుద్ది చెప్పాలని సూచన..
CM Revanth reddy: కేసీఆర్‌తోనే బీఆర్ఎస్ పనైపోయింది..!.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

CM Revanth Reddy sensational comments on former cm kcr and ktr: హైదరాబాద్ జూబ్లిహిల్స్ బై పోల్స్  ప్రచారంకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీల నేతల మధ్యమాటల తూటాలు పేలుతున్నాయి.  తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డి  మీట్ ది ప్రెస్ కార్యక్రమంను నిర్వహించారు.ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్రమైన వ్యాఖ్యలు  చేశారు.  కేసీఆర్ తోనే బీఆర్ఎస్ పని ఐపోయిందంటూ ఎద్దేవా చేశారు.ఆ బాధతోనే ఫాంహౌజ్ నుండి కేసీఆర్ బయటికి రావడం లేదన్నారు.

Add Zee News as a Preferred Source

ఇప్పటి వరకు కేసీఆర్ జూబ్లిహిల్స్ ఎన్నికల్లో.. బీఆర్ఎస్ ను గెలిపించమని ఎందుకు చెప్పలేదని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ మాగంటి సునీతను.. గెలిపించమని ఈ నిమిషం వరకు ఎందుకు అడగలేదని గుర్తుచేశారు.

ఆరోగ్యం బాగాలేకపోయి ప్రచారానికి రాకపోలేదనుకుందాం.. కానీ ఎందుకు బీఆర్ఎస్ గెలిపించాలని పిలుపునివ్వడం లేదన్నారు. తన కొడుకు ,అల్లుడు మీద కేసీఆర్ కు ఎలాంటి  అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి పంచ్ లు వేశారు.
కేసీఆర్ పై సానుభూతి చూపిస్తాం తప్పా.. ఆయనను ప్రత్యర్థిగా భావించడం లేదన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి.. ఇచ్చిన మాట సోనియా గాంధీ నెరవేర్చేందుకు రాజకీయంగా నష్టపోయినా లెక్కచేయలేదన్నారు. ఆనాడు యూపీఏ-1, యూపీఏ-2 లో రైతులు, రైతుల సంక్షేమం కోసం కృషి చేసిందన్న విషయంను గుర్తు చేశారు. 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్, 1300 కోట్ల విద్యుత్ బకాయిల మీద మొట్ట మొదటి సంతకం చేశారన్నారు.  73 వేల కోట్ల రుణమాఫీని మన్మోహన్ సింగ్ అమలు చేశారని సీఎం రేవంత్ అన్నారు.

కనీస మద్దతు ధరను ప్రకటించి రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు.  జలయజ్ఞం ద్వారా సాగునీటిని అందించేందుకు కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ ప్రజలకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. కల్వకుర్తి , బీమా, నెట్టెంపాడు, ఆర్డీఎస్, ఇందిరా సాగర్, ఎస్ఎల్బీసీ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. 

ఎస్సారెస్పీ, మిడ్ మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి ఇలా చాలా ప్రాజెక్టులు చేపట్టిందన్నారు.  పేదల గుండె చప్పుడు పీజేఆర్ ను మనం గుర్తు చేసుకోవాలన్నారు. హైదరాబాద్ లో తాగు నీటి సమస్య వచ్చినపుడు కుండలతో నిరసన తెలిపి, చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారన్నారు. కృష్ణా జలాలను నగరానికి తరలించేలా చేసి జంట నగరాల దాహార్తిని తీర్చారని తెలిపారు.

హైదరాబాద్ ఐటీ, నాలెడ్జ్ సిటీగా మారిందంటే ఆనాటి కాంగ్రెస్పాలసీలే కారణంమంటూ రేవంత్ స్పష్టం చేశారు. విద్యుత్ కొరత ఉన్న జంట నగరాలకు నిరంతర విద్యుత్ అందించడం వల్లే దిగ్గజ సంస్థలు నగరానికి తరలి వచ్చాయన్నారు. దేశంలో బల్క్ డ్రగ్స్ లో 40 శాతం మన నగరం నుంచి ఉత్పత్తి అవుతున్నాయన్నారు.  నగరంలో ఇటీవల ఎలీ లిల్లీ 1 బిలియన్ డాలర్స్ పెట్టుబడులు పెడుతోందన్నారు. అమెరికన్ ఎయిర్ లైన్స్, మెక్ డొనాల్డ్… ఇలా ప్రపంచంలోని 70 శాతం ఫార్చ్యూన్ 500 కంపెనీలు హైదరాబాద్ లో జీసీసీలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు.

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ గా తయారు కావడం వెనక కాంగ్రెస్ కృషి ఎంతో ఉందన్నారు.  తెలంగాణలో 65 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తోందన్నారు.  దేశంలోనే  పర్ క్యాపిటాలో రంగారెడ్డి జిల్లా ఉందని, ఇందుకు ఆనాడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు.  25 లక్షల అసైన్డ్, 10 లక్షల ఎకరాల పోడు భూములను పంచిన ఘనత ఇందిరమ్మదన్నారు. 

దున్నే వాడికే భూమి అనే నినాదాన్ని పకడ్బందీగా అమలు చేసిన ఘనత పీవీ, ఇందిరా గాంధీలదని కొనియాడారు. జైపాల్ రెడ్డి కృషి వల్లే హైదరాబాద్ కు మెట్రో వచ్చిందన్నారు. ఇది చరిత్ర.. ఇది కేసీఆర్  చెరిపేస్తే చెరిగేది కాదన్నారు. ఆనాటి కాంగ్రెస్ పదేళ్ల పాలన, కేసీఆర్ పదేళ్ల పాలనను పోల్చి చూడాలన్నారు. 

Read more: Brs Ktr: నువ్వు టెంప్ట్ అవ్వకు.. కేసీఆర్ ఫోన్ కాల్ సీక్రెట్ బైటపెట్టిన కేటీఆర్.. అసలు విషయం ఏంటంటే..?

60 వేల కోట్ల మిగులుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే పదేళ్లలో 8 లక్షల 11 వేలకోట్ల అప్పులతో వాళ్లు మాకు అప్పగించారన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో… పాతాళంలోకి పడిపోయే స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పగించారని సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై, గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News