Revanth Reddy: శ్రీలీల పుష్ప ఐటమ్ సాంగ్‌‌కు.. కేటీఆర్ ప్రచారానికి పెద్ద తేడా లేదు: సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy: జూబ్లీహిల్స్ బై పోల్ దంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకి పెరిగిపోతుంది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వంపై కేటీఆర్ చేసే విమర్శలు.. సినిమాలో ఐటమ్ సాంగ్‌లాగా ఉన్నాయని చెప్పారు. హీరోయిన్ శ్రీలీల ఐటమ్ సాంగ్‌‌కు..కేటీఆర్ ప్రచారానికి పెద్ద తేడా లేదన్నారు.  

Written by - Aruna Maharaju | Last Updated : Nov 9, 2025, 01:13 PM IST
Revanth Reddy: శ్రీలీల పుష్ప ఐటమ్ సాంగ్‌‌కు.. కేటీఆర్ ప్రచారానికి పెద్ద తేడా లేదు: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Fire On KTR: రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమపై కేటీఆర్ చేస్తున్న విమర్శలు  సినిమాలో ఐటమ్ సాంగ్‌లాగా ఉన్నాయని చెప్పారు.  శ్రీలీల ఐటమ్ సాంగ్‌‌కు..కేటీఆర్ ప్రచారానికి తేడా లేదన్నారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని అవమానించిన కేటీఆర్ మహిళలకు రక్షణ కల్పిస్తాడా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Add Zee News as a Preferred Source

ఈ మీట్ లో సీఎం రేవంత్ మాట్లాడుతూ..  రూ. 8 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పగించారని మండిపడ్డారు. వాళ్ల అప్పులు తీరుస్తూ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రాన్ని పూర్తిగా  దివాళా తీయించారని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్‌లతో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. తాము చేసిన పనులు కేసీఆర్ చెరిపేస్తే పోయేవి కాదన్నారు. 

అయితే కాంగ్రెస్ ఎంత త్యాగం చేసిందో అందరికీ తెలిసిందన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ ఏర్పడిందన్నారు. అధికారంలోకి వచ్చిన పదేళ్లలో  బీఆర్ఎస్ అభివృద్ధి చేయడం పక్కన పెట్టి.. అప్పులు చేసి పోయిందన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని,  డబ్బులన్నీ ఎక్కడికి పోయాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని.. తమకు ఈసారి అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని వందల కోట్లతో అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత కాంగ్రెస్ పాలన (2004-2014)లో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.

Also Read: AP Govt: ఏపీలో పంట నష్టపోయిన రైతులకు రూ. 25 వేలు.. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన

Also Read: Ration Card: బిగ్ అలర్ట్.. ఏపీ ప్రజలకు ఇదే లాస్ట్ చాన్స్.. లేదంటే రేషన్ కార్డులు రద్దు.. వెంటనే ఇలా చేయండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News