cm revanth reddy on ttd comments goes viral: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చింది. అయితే.. ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హమీలను నెరవేరుస్తామని ఎక్కడకు వెళ్లిన కూడా అక్కడి దేవుళ్ల మీద ప్రమాణాలు చేశారు. దీనిపై కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి అమలుకు సాధ్యం కానీ.. 420 హమీలు ఇచ్చి ఎన్నికలలో ప్రజల్ని మోసం చేసి.. ఓట్లు పడేలా చేసుకున్నారని తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ ఇటీవల గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియమాకల ప్రక్రియను వేగవంత చేశారు.
ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్ లను కూడా టీజీపీఎస్సీచే రిలీజ్ చేయించారు.ఈ నేపథ్యంలో తాజాగా...రవీంద్ర భారతీలో ప్రజాపాలనలో కొలువుల పండగ అనే కార్యక్రమంను నిర్వహించారు . దీనికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్.. ఇటీవల తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి ఇచ్చే సిఫారసులను ఆమోదించుకునే అంశంపై మాట్లాడారు. ప్రతిసారి ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీని తమ నేతలు ఇచ్చే సిఫారసుల్ని ఆమోదించాలని అడుక్కొవాల్నా.. అంటూ మండిపడ్డారు.
టీటీడీ దర్శనాలకు చంద్రబాబును అడుక్కునుడు ఏంది? మనకి మన గుడులు లేవా?
వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది - రేవంత్ రెడ్డి pic.twitter.com/Nz7BVm8QnZ
— Telugu Scribe (@TeluguScribe) March 20, 2025
అక్కడ టీటీడీ ఉంటే.. తమ దగ్గర వైటీడీ ఉందన్నారు. యాదగిరి గుట్టను బ్రహ్మండంగా డెవ్లప్ చేశామన్నారు. నూతంగా వైటీడీ బోర్డును , ఆలయ కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ కూడా భక్తులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణలో ఇంకా బోలేడు దేవాలయాలన్నాయని.. భద్రాచలంలో రాములవారు.. రామప్ప శివుడి ఆలయాలున్నాయన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు రెండు తెలుగు స్టేట్స్ లలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
దీనిపై సోషల్ మీడియాలో కొంత మంది రేవంత్ ఇప్పటిదాక.. దేవుళ్లపై ఓట్టులు పెట్టి అబద్దపు మాటలు చెప్పాడని అన్నారు. కానీ ఇప్పుడు.. ఏకంగా దేవుళ్ల మధ్యన చిచ్చుపెట్టాడని కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా కూడా హట్ టాపిక్ గా మారాయి. మరోవైపు టీటీడీ మాత్రం... ఏపీ చంద్రబాబు ఆదేశాల మేరకు మార్చి 24 నుంచి తెలంగాణ రాజకీయ నేతల నుంచి వచ్చే సిఫారసులను అనుమతిస్తామని టీటీడీ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









