)
CM Revanth reddy slams on brs ktr and union minister kishan reddy: తెలంగాణలో ప్రస్తుతం జూబ్లిహిల్స్ బై పోల్స్ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం జోరును పెంచాయి.ఈ క్రమంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ కేటీఆర్ లపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఒకటే సూచన చేయదలచుకున్నట్లు తెలిపారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు.
2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో బీఆరెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభివృద్ధిని పోల్చి చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, మెట్రో, నాలెడ్జ్ సెంటర్స్, ఐటీ, ఫార్మా ఇలా… అన్ని రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ బీజం వేసిందని గుర్తు చేశారు. ఐటీఐఆర్ హైదరాబాద్ రాకుండా చేసింది బీఆర్ఎస్ లు, బీజేపీ కాదా?.. అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ తీసుకున్న ప్రణాళికలతోనే హైదరాబాద్ ఆదాయం పెరిగిందన్నారు.
వరదల్లో హైదరాబాద్ మునిగిపోతే కిషన్ రెడ్డి కేంద్రం నుంచి చిల్లిగవ్వ తీసుకురాలేదన్నారు. సచివాలయంలో ఆలయం కూల్చేస్తే కిషన్ రెడ్డి స్పందించలేదన్నారు. కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు గోదావరిపాలు చేశారన్నారు. ప్రగతి భవన్ కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి మాత్రమే ఉపయోగపడిందన్నారు. కొడుకు కోసం వాస్తు సరిద్దడానికి ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టిండన్నారు. సచివాలయం నిర్మిస్తే ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? ఎవరికైనా పనికొచ్చిందా అంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు.
పేద ప్రజలకు ఆ సచివాలయంతో ఏమైనా ప్రయోజనం ఒనగూరిందా అంటూ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ కోసం కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకున్నారన్నారు. సద్దాం హుస్సేన్ లా ప్రాణభయంతో తనను తాను కాపాడేందుకు ప్రగతి భవన్ లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ లు కట్టుకున్నాడన్నారు. అదే విధంగా.. 8 లక్షల 11 వేల కోట్ల అప్పుతో మాకు రాష్ట్రాన్ని అప్పగించారన్నారు. ఆనాడు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విద్యా సంస్థలే మనకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చాయన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ను రద్దు చేయడం తప్ప వీళ్లు ఒక్క అదనపు ఎయిర్ పోర్టునైనా తెచ్చారా అంటూ గత పాలనను ఏకీపారేశారు. పదేళ్లలో మెట్రోను ఒక కిలోమీటరైనా విస్తరించారా.. ?.. అంటూ ప్రశ్నలు వేశారు. నగర విస్తరణతో పాటు మెట్రో విస్తరణ ఎందుకుచేయలేదని, కాంగ్రెస్ మొదలు పెట్టిన సాగునీటి ప్రాజక్టులను పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదన్నారు.
పదేళ్లలో 20 లక్షల కోట్ల బడ్జెట్ ను ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును కూడా అమ్ముకున్నారన్నారు. పదేళ్ల కోసం కొత్త ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ నగర ప్రజల కోసం పరితపించిన పీజేఆర్, శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేవారని..
ఇప్పుడు కిషన్ రెడ్డి, కేటీఆర్ ను బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారని సీఎం రేవంత్ తూర్పార బట్టారు.
మెట్రో, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీని బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారన్నారు. మేం వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు లకు అనుమతులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. మరిన్ని ఎయిర్ పోర్టులకు అనుమతులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. డ్రై పోర్టు ఏర్పాటు కోసం గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించేందుకు అనుమతులు తెచ్చుకున్నామన్నారు. ఎలీ లిల్లీ లాంటి కంపెనీ 1 బిలియన్ డాలర్స్ ఫార్మాలో పెట్టుబడులు పెడుతోందన్నారు.
రెండేళ్లలో ఒక ఏడాది ఎన్నిక కోడ్ తో అభివృద్ధి జరగలేదన్నారు. మిగిలిన ఏడాదిలో 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామన్నారు. వేలాది కోట్లు తెచ్చి నగర విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలకు ఉపయోగంలేని ప్రగతి భవన్, కాళేశ్వరం, కమాండ్ కంట్రోల్, సచివాలయం చూపించి ఇంకా ఎన్నాళ్ళు కాలం గడుపుతారని బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు దండుకుని దోచుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేశారా? అని ప్రశ్నించారు. కేటీఆర్ తీసుకొచ్చింది కేవలం గంజాయి, డ్రగ్స్ మాత్రమేనన్నారు.
మీ బావమరిది బావమరిది డ్రగ్స్ తీసుకుని దొరికింది నిజం కాదా?.. అంటూ ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన మీరు చేసిన ఏ ఒక్క ప్రాజెక్టునైనా చూపించాలన్నారు. నగర అభివృద్ధిపై బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరూ ఎక్కడ చర్చకు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నామన్నారు. నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజా ప్రతినిధుల సహకారం ఉండాలన్నారు. అందుకే జూబ్లీహిల్స్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ లు సహకరించి ఉంటే నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకునే వాళ్లమన్నారు. మెట్రో విస్తరణ చేసుకుందాం, గోదావరి జలాలు తెచ్చుకుందాం, మూసీ ప్రక్షాళన చేసుకుందాంమంటే.. కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నావ్ అంటూ ప్రశ్నించారు. అదే విధంగా.. ఎందుకు కేటీఆర్ కు లొంగిపోయావ్? ... అంటూ ఫైర్ అయ్యారు. నగరంలోని 695 చెరువులలో 44 చెరువులను బీఆర్ఎస్ కబ్జా చేసిందన్నారు. మీరు ఆక్రమించుకున్న చెరువులను విధించినందున హైడ్రా పై విషం చిమ్ముతున్నారన్నారు. బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి ఎవరు బీఆర్ఎస్ కాదా? అంటూ ప్రశ్నించారు.
సున్నం చెరువు, నల్ల చెరువును ఆక్రమించుకుంది నిజం కాదా.. అంటూ ఫైర్ అయ్యారు. వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించి నగరంలో రోడ్లపై నీళ్లు నిలవకుండా చేసింది హైడ్రా కాదా?.. ఈగల్ ఫోర్స్, హైడ్రా పై కేటీఆర్ కక్ష పెట్టుకున్నాడన్నారు.
హైడ్రా ఎక్కడ తప్పు చేసిందో చెప్పు నిజ నిర్ధారణ కమిటీ వేద్దామన్నారు. కేసీఆర్ కుటుంబంతో ఉండే వాళ్ళందరినీ హరీష్ బీఆర్ఎస్ నుంచి బయటకు పంపేశారన్నారు. ఇప్పుడు ఇంట్లో కవితను కూడా బయటికి పంపేలా చేశారన్నారు. వీళ్లా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది.
కేటీఆర్, కిషన్ రెడ్డి… మేమేమైనా మీ ఆస్తులు అడుగుతున్నామా?.. అభివృద్ధికి సహకరించాలని అడుగుతున్నామని రేవంత్ రెడ్డి కౌంటర్ లు వేశారు. విజ్ఞత కలిగిన జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచనతో ఓటు వేయండి.. కాంగ్రెస్ ను గెలిపించాలని ఓటర్లను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook