Cm revanth reddy visits yadadri bhuvanagiri aleru: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరి జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో పలు డెవ్ లప్ మెంట్ పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో మాట్లాడారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు.
తిరుమల టీటీడీ తరహాలోనే.. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. యాదగిరిగుట్ట అలయం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. నవంబర్ 8న పాదయాత్ర చేసి మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరతామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అదే విధంగా.. ఎవరు అడ్డుపడినా మూసీ పునరుజ్జీవనం చేసి తీరుతమని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు.
BRS is DRS - Dayyala Rajya Samithi - CM Revanth Reddy reacts to MLC Kavitha’s statement on devils around KCR pic.twitter.com/JvESKd2YiC
— Naveena (@TheNaveena) June 6, 2025
మోదీ సబర్మతి, గంగా నది ప్రక్షాళన చేసుకోవచ్చు గానీ... తెలంగాణ సర్కారు.. మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా?.. అంటూ ఫైర్ అయ్యారు. మా నల్లగొండల బిడ్డలు మూసీ మురికి కూపంలో బ్రతకావాల్సిందేనా?.. అంటూ అపోసిషన్ పార్టీపై ధ్వజమెత్తారు. ఎవరేం అనుకున్నా సరే… మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. నల్లగొండ గడ్డ చైతన్యానికి మారుపేరు..నిజాంనవాబులను దిగంతాలకు తరిమిన చరిత్ర నల్లగొండదన్నారు. ఎవరో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే నల్లగొండ బిడ్డలు చూస్తూ ఊరుకోరన్నారు.
గత బీఆరెస్ పదేళ్లపాలనలో నల్లగొండకు వాళ్లు చేసిందేం లేదన్నారు.. ఎస్ఎల్బీసీ, బునాదిగాని కాలువ.. ఇలా పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. ఆ ఇంటి బిడ్డ కల్వకుంట్ల కవితనే.. చుట్టూ దయ్యాలు ఉన్నాయని బయటపెట్టినా… ఆదెయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం చెప్పలేదని..కేసీఆర్ పై పంచ్ లు వేశాడు.. ఇక మీదట.. బీఆర్ఎస్ కాదని డీఆరెస్.. డీఈ దెయ్యాల రాష్ట్ర సమితి అంటూ కేసీఆర్ పై శివాలెత్తిపోయారు.
ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణను.. గత పదేళ్లు రాబందుల్లా దోచుకుని తిన్నారన్నారు. ఆనాడు వాసాలమర్రికి వచ్చి… ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండు ఇచ్చి ఆసుపత్రిపాలు చేసిండు వాసాలమర్రిలో ఇండ్లు కూలగొట్టి స్మశానంగా మార్చిండని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఆగం చేసినా వాసాలమర్రి పరిస్థితిని బాగు చేయాలని మా నాయకులను ఆదేశిస్తున్నా మేం అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నమన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్న
నీళ్లు ఎలా ఇస్తారని కొందరు మాట్లాడుతున్నారు ఎస్ఆరెస్పీ, మిడ్ మానేరు కట్టిందెవరో గుర్తు చేసుకొవాలన్నారు. ప్రాజెక్టులు కట్టిన మాకు గంధమల్లకు నీళ్లు ఎట్లా ఇవ్వాలో మాకు తెలియదా?.. ప్రజాపాలనలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్నికల్పించామన్నారు. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చింది నిజం కాదా?.. అంటూ రేవంత్ పలు ప్రశ్నలు వేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డల చేతిలో పెట్టామని,
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని మేం ప్రయత్నిస్తుంటే కొంతమంది ఏడుస్తున్నారని, రూ. 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసింది నిజం కాదా.. అని రేవంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కులగణన ద్వారా బీసీల లెక్క తేల్చి 42 శాతంరిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశాం… కేంద్ర ప్రభుత్వం కులగణన చేసే అనివార్యతను కల్పించామన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం ఒక్క నోటీసు ఇస్తేనే ఆయన ఆగమాగం అయితుండు… జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తుండని కేసీఆర్ పై సెటైర్ లు వేశాడు. ముందు గల్ల.. కల్వకుంట్ల కవిత ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఆలేరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ మాట ఇస్తున్నానని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









