KCR Meet BRS Party Leaders: 'రాష్ట్రం ఎక్కడకు పోతే ఏమిటి? ప్రజలు ఏమైతే ఏమిటి? తమ స్వార్థ రాజకీయ అధికారమే పరమావధిగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజల పాలిటశాపంగా మారారు' అని బీఆర్‌ఎస్ పార్టీ, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అంధకారంలో ఉండగా.. అభివృద్ధి, సంక్షేమం అందించినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతోందని గులాబీ అధినేత అసహనం వ్యక్తం చేశారు.
Also Read: BRS Party: రజతోత్సవానికి గులాబీ దళం సిద్ధం.. పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం
బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నాయఉలతో వారం రోజులుగా కేసీఆర్ సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, అదిలాబాద్, హైద్రాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల నాయకులతో జరిగిన సమావేశాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రజతోత్సవ సభను విజయవంతం చేసేలా చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.
Also Read: K Kavitha: 'వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్ నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ పారిపోయారు'
‘రాజకీయ కోణం పక్కన పెడితే తెలంగాణ ప్రజల పట్ల మనకు ఉండే చిత్తశుద్ది మరెవరికీ ఉండదు. 15 ఏళ్లు రాష్ట్రం కోసం కొట్లాడిన బిడ్డలుగా, పదేండ్ల పాటు రాష్ట్ర ప్రగతి కోసం తండ్లాడిన బిడ్డలుగా మీకే ప్రజల సంక్షేమం పట్ల కడుపునొప్పి ఉంటది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. 'తెలంగాణ అంటే ఇతరులకు రాజకీయ క్రీడ.. మనకు ఒక టాస్క్’ అని పునరుర్ఘాటించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నాయకులకు ఆదేశించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న కార్యకర్తలు, నాయకులను కేసీఆర్ అభినందించి ఇదే స్ఫూర్తిని కొనసాగాలని కేసీఆర్ సూచించారు.
'పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అంధకార పరిస్థితులు ఉండేవి. విద్యుత్ రంగం అగమ్యగోచరంగా ఉండేది. నాటి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది కృషితో ప్రభుత్వ పట్టుదలతో తొమ్మిది నెలల ఆనతికాలంలోనే తెలంగాణను కరెంటు కష్టాల నుంచి గట్టెక్కించాం' అని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి పట్ల ఉద్యమ ఇంటి పార్టీ బీఆర్ఎస్‌కు ఉన్న ప్రేమ అభిమానమే కారణం’ అని కేసీఆర్ వివరించారు.
'రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 7 వేల మెగావాట్లుగా ఉన్న విద్యుత్ సామర్థ్యాన్ని 20 వేల మెగావాట్లకు పెంచుకున్న ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే' అని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషితో మరో 2400 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రాగా.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమగా విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు, రైతులకు అందించలేకపోతున్నదో అర్థం కావట్లేదు' అని కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అసమర్థతగా ప్రకటించారు.
'తాను పదవిలోకి వచ్చాక ప్రజలతో అనిపించుకోవాలని ఒక సర్పంచ్ అనుకుంటాడు. సర్పంచ్ ఒక్కడే కాదు ప్రతి మనిషీ తనకు సేవ చేసే అవకాశం వస్తే ప్రజలచేత శభాష్ అనిపించుకోవాలని చూస్తాడు. కానీ ఈ ప్రభుత్వానికి అది లేదు. ప్రతి నిర్ణయంతో ప్రజలతో ఛీత్కారాలు ఎదుర్కోవడం తప్పిదే ఒక్క పనిచేసి కూడా ప్రజలతో ప్రశంసలు పొందాలనుకోకపోవడం.. ఆ సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయం' అని కేసీఆర్ పేర్కొన్నారు. 'రైతులపై ప్రేమ, వ్యవసాయంపై అభిమానం ఉంటే పాలనా ప్రాధాన్యాలు అర్థమవుతాయి. దానివలన యంత్రాంగం మీద పట్టుసాధించి ప్రజల సంక్షేమం కోసం రాజీపడకుండా పాలన అందించగలుగుతారు' అని కేసీఆర్ వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









