Telangana Cabinet: కేబినెట్ మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్.. ఆ రోజే నేతల ప్రమాణ స్వీకారం..?..

cm revanth reddy cabinet expension: తెలంగాణ మంత్రి వర్గవిస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.  పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలు మాత్రంఫుల్ జోష్ లో ఉన్నారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Jun 7, 2025, 04:09 PM IST
  • తెలంగాన మంత్రి వర్గ విస్తరణపై గుడ్ న్యూస్..
  • పండగ చేసుకుంటున్న ఆశావహులు..
Telangana Cabinet: కేబినెట్ మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్.. ఆ రోజే నేతల ప్రమాణ స్వీకారం..?..

Congress high command gives green signal for expansion of telangana cabinet: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయ్యింది. అయితే.. కాంగ్రెస్ పార్టీలో మంత్రి వర్గ విస్తరణపై గత కొంత కాలంగా అనేక చర్చలు జరిగాయి. ఎంతో మంది నాయకులు.. తమకు సముచిత స్థానం కోసం తమదైన స్టైల్లో ఢిల్లీకి వెళ్లి చక్రం తిప్పారు.

Add Zee News as a Preferred Source

అయితే.. సీఎం రేవంత్ మంత్రి వర్గ విస్తరణ అప్పుడు.. ఇప్పుడూ.. అంటూ గత కొన్ని నెలలుగా అనేక ఊహాగానాలు వైరల్ అవుతునే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా.. మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఈ ఊహాగానాలకు తెరదించుతూ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యనేతలతో మంత్రి వర్గవిస్తరణపై పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తొంది.

గత రెండు మూడు రోజులుగా వీరంతా సమావేశంఅయి.. మంత్రి వర్గ విస్తరణపై కీలక చర్చలు జరిపారని స్పష్టంగా తెలుస్తొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సైతం..  తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలిపింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో త్వరలోనే కొత్త మంత్రులు రాబోతున్నారు.

Read more: Khammam Lady SI Video: ఖమ్మంలో అమానుషం.. లేడీ ఎస్సై ప్రైవేటు పార్ట్స్ లను తాకుతూ, రాత్రిపూట పైశాచీకం...  వీడియో..

అయితే.. మంత్రి వర్గ విస్తరణ రేపు ఆదివారం ఉండవచ్చని, అదే రోజున ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని కూడా తెలంగాణ రాజకీయల్లో చర్చ ఊపందుకుంది. సీఎం రేవంత్ క్యాబినెట్ లో.. కొత్తగా.. ముగ్గురు నుంచి నలుగురు సభ్యులకు స్థానం కల్పించే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తొంది.

ఈ క్రమంలో అన్ని సామాజిక వర్గాల సమీకరణాల్నిదృష్టిలో ఉంచుకుని ఈ మంత్రి వర్గవిస్తరణ ఉండనుందని తెలుస్తొంది. మరోవైపు.. కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో మంత్రి వర్గవిస్తరణపై గంపెడాశలుపెట్టుకున్న ఆశావహాలు.. మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఎవరికి వారు నేతలు.. మరింత జోరుగా చక్రం తిప్పే పనుల్లో బిజీగా ఉన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News