
Telangana Cabinet Expansion: తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈనెలలో కేబినెట్‌ను విస్తరించుకోవాలని పార్టీ హైకమాండ్ రేవంత్‌కు చెప్పినట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ పెద్దలతో కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపారు. దాంతో ఈసారి ఆరు బెర్తులను ఒకేసారి భర్తీ చేయాలని హైకమాండ్ రేవంత్‌ను ఆదేశించిందట. ఈ సమావేశంలోనే సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎవరెవరికి చాన్స్ ఇవ్వాలనే దానిపైన చర్చ జరిగినట్టు సమాచారం. చివరకు చర్చలు సఫలం కావడంతో ఉగాది రోజున మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మార్చి 30న మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఖాయమైందని గాంధీభవన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇక కేబినెట్ విస్తరణలో చోటు కోసం చాలా మంది లీడర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత కేబినెట్లో కొన్ని జిల్లాలకు అసలు ప్రాతినిథ్యమే లేదు.. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు. ఆదిలాబాద్ జిల్లాకు కేబినెట్లో చోటులేదు.. దాంతో ఈ జిల్లాలకు తొలి ప్రాధాన్యత ఇస్తారని ఇన్నాళ్లు ప్రచారం సాగింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పదవులు ఎవరెవరికి దక్కనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నల్గొండ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ పక్కా అని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే కేబినెట్లో రాజ్‌గోపాల్‌కు చాన్స్ దక్కితే.. మాత్రం.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని పక్కన పెట్టేనే చాన్స్ ఉందని అంటున్నారు. గతంలో నల్గొండ నేతలకు పదవుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఇదే ఫార్ములాను అమలు చేసినట్టు చెబుతున్నారు.
ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మక్తల్ ఎమ్మెల్సీ వాకిటి శ్రీహారికి కేబినెట్ బెర్త్ ఖాయమైందని అంటున్నారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన శ్రీహారి.. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు అంత్యంత ఆప్తుడు.. అంతేకాదు ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో ముదిరాజ్‌లకు చోటు లేదు.. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ముదిరాజ్‌కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో వాకిటికి బెర్త్ ఖాయమైందని అంటున్నారు. అటు మైనారిటీ కోటా నుంచి అమీర్ అలీఖాన్, ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు తాజాగా కొత్తగా ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, విజయశాంతికి చోటు దక్కింది. వీరిలో నుంచి విజయశాంతిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని టాక్. విజయశాంతికి బీసీ మహిళా కోటాలో హోంశాఖ ఇస్తారని అంటున్నారు. అయితే విజయశాంతికి మంత్రివర్గంలోచోటు కల్పిస్తే.. మాత్రం ప్రస్తుతమున్న మహిళా మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన పలికే చాన్స్ ఉందంటున్నారు. మరోవైపు అద్దంకి దయాకర్‌కు మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు..
అటు ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు కోసం గడ్డం వివేక్ సోదరులు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు ఖాయమని అంటున్నారు. కానీ ఒకవేళ అద్దంకి దయాకర్‌కు మంత్రి పదవి ఇస్తే.. గడ్డం సోదరులకు బ్రేక్ పడొచ్చని టాక్. మరోవైపు ఇదే జిల్లా నుంచి మంత్రి పదవిపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో ప్రేమ్ సాగర్‌కు దక్కకపోవచ్చని అంటున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా నుంచి ఇద్దరు రెడ్డి నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలో ఒకరికి దక్కొచ్చని చెబుతున్నారు. మొత్తంగా ఉగాది రోజుల కేబినెట్ విస్తరణతో ఎవరెవరికి పోస్టులు దక్కుతాయి అనేది తేలిపోనుందని పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి