Congress: ఒక్క మీటింగ్.. వీహెచ్‌కు బిగ్ షాకిచ్చిన అధిష్టానం..!

Congress MLC Candidates: కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ వీహెచ్‌కు కాంగ్రెస్ హైకమాండ్‌ షాక్ ఇచ్చిందా..! మున్నురు కాపు సంఘాల మీటింగ్‌పై హైకమాండ్ గుస్సా అయ్యిందా..! పార్టీ లైన్‌ దాటి సమావేశాలు ఎలా నిర్వహిస్తారని క్లాస్‌ తీసుకుందా..! కేవలం ఒక్క మీటింగ్‌తో వీహెచ్‌కు ఎమ్మెల్సీ పదవి విషయంలో మెలిక పెట్టిందా..! దాంతో మాజీ ఎంపీ లబోదిబోమంటున్నారా..!   

Written by - G Shekhar | Last Updated : Mar 7, 2025, 07:03 PM IST
Congress: ఒక్క మీటింగ్.. వీహెచ్‌కు బిగ్ షాకిచ్చిన అధిష్టానం..!

Congress MLC Candidates: కాంగ్రెస్ సీనియర్‌ నేత వీ. హనుమంతరావు.. చాలారోజులుగా పదవి కోసం అల్లాడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా.. వీహెచ్‌కు పదవి దక్కలేదు.. తనను రాజ్యసభకు పంపాలని గతంలో కోరినా.. ఆయన స్థానంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభిషేక్‌ మనుసింఘ్వికి పెద్దల సభకు పంపించారు. దాంతో రాష్ట్రంలో ఏదో పదవి దక్కుతుందని వీహెచ్‌ భావించారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడంతో.. కనీసం ఎమ్మెల్సీగా అయినా నామినేట్‌ చేస్తారని ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క మీటింగ్‌  వీహెచ్‌ ఎమ్మెల్సీ పదవికి ఎసరు పెట్టినట్టు గాంధీభవన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
తాజాగా  హైదరాబాద్‌లో తెలంగాణ మున్నురు కాపు సంఘం నేతల భేటీ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన రోజునే.. వీహెచ్‌ ఇంట్లో మున్నురు కాపు సంఘం లీడర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా సమావేశమైన కాపు నేతలు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మున్నూరు కాపుల ప్రాతినిధ్యం లేకుండా ఏ మంత్రి వర్గం లేదని.. ఖచ్చితంగా మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాపు నేతలు నిర్ణయించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న సస్పెండ్ పై కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేయాలని సూచించారు.
 
అయితే ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్‌ వీహెచ్‌పై సీరియస్‌ అయ్యినట్టు తెలిసింది. పార్టీ లైన్‌ను దాటి సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయ్యుండి.. కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీపై.. నిందలు మోపేందుకు ఇలా సమావేశం నిర్వహిస్తారా అని నిలదీసినట్టు తెలిసింది. వాస్తవానికి మొన్నటివరకు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎవరికివారే అన్నట్టు పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ వచ్చారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగేలా ఎవరు వ్యవహరించినా వెంటనే రియాక్ట్ అవుతున్నారు. తాజాగా తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే మల్లన్న సస్పెన్షన్‌పై నేతలంతా కామ్‌ అయ్యారు. కానీ వీహెచ్‌ మాత్రం మున్నురుకాపు నేతల మీటింగ్‌ నిర్వహించి. అగ్నికి ఆజ్యం పోసినట్టు చేశారు.
 
మొత్తంగా మున్నురు కాపుల బలాన్ని కాంగ్రెస్ చూపిద్దామని భావించిన వీహెచ్‌ ప్రయత్నం బెడిసికొట్టింది. ఏడాదిన్నరగా పదవికోసం ఎదురుచూసిన వీహెచ్‌కు ఇప్పట్లో పదవి దక్కడం కష్టమని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. మరోవైపు లేకలేక అందివచ్చినా అవకాశాన్ని సీనియర్‌నేత వీహెచ్‌ కాళ్లదన్నుకున్నారని అంటున్నారు. మొత్తంగా ఇప్పడున్న పరిస్థితుల్లో మాత్రం వీహెచ్‌ పదవి దక్కడం కష్టమేనని గాంధీభవన్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.. 

Add Zee News as a Preferred Source

Also Read: Amalaki Ekadashi: అమలకి ఏకాదశి ఎప్పుడు..?.. దీని విశిష్టత.. ఈ ఒక్కపనిచేస్తే జీవితంలో డబ్బులకు లోటు ఉండదు..!  

Also Read: Schools Holiday: మార్చి 14న అన్ని పాఠశాలలకు సెలవు.. ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Trending News