Telangana Cabinet Ministers: తెలంగాణలో కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కొత్తగా ఆమాత్యులుగా కొలువుదీరారు. అయితే సామాజిక వర్గాల పరంగా చూసిన మాల,ముదిరాజ్, మాదిగ సామాజిక వర్గాలకు కొత్త మంత్రివర్గంలో చోటు కల్పించారు.అయితే కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు తో పాటు శాఖల మార్పుల పైన కాంగ్రెస్ అధిష్టాన ముఖ్యులు, రేవంత్ రెడ్డి మధ్య చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఏఐసీసీ లీడర్ కేసి వేణుగోపాలతో గంటకు పైగా సమావేశమయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖార్గేతో భేటి అయ్యారు.
మల్లిఖార్జున ఖర్గే తర్వాత కాంగ్రెస్ పార్టీ అనధికార అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదంతో మంత్రుల శాఖల మార్పులు, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు చేసే అవకాశాలున్నాయి. మంత్రి పదవుల్లోనే కాదు శాఖల కేటాయింపుల్లోనూ సామాజిక న్యాయం కు ప్రాధాన్యత నివ్వాలంటున్న కాంగ్రెస్ హై కమాండ్. కొందరు మంత్రుల పనితీరు సరిగా లేదంటూ ఇప్పటికే అధిష్టానానికి నివేదించిన కొందరు పార్టీ నేతలు. మంత్రుల పనితీరుపై ఇప్పటికే అధిష్టానానికి నివేదిక ఇచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, వివిధ స్థాయి నేతలతో భేటి లో అందిన సమాచారం ఆధారంగా నివేదికల రూపొందించిన మీనాక్షి నటరాజన్ అంతేకాదు దాన్ని అధిష్టానికి వివరించింది. ముఖ్యంగా కొన్ని కీలక శాఖల బాధ్యతలు అన్ని కొందరు మంత్రులే నిర్వహిస్తుండటంతో పని భారం కారణంగా కొన్ని శాఖల్లో ఆశించిన ఫలితాలు రావట్లేదనే కాంగ్రెస్ ముఖ్య నేతలు భావిస్తున్నారు.
మంత్రుల పనితీరు వ్యవహార శైలిపై గతంలోనే హస్తినలో సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు ఇచ్చారు కేసి వేణుగోపాల్.
ముక్యంగా ప్రభుత్వ పాలన వ్యవహారాలు,మంత్రుల వ్యవహార శైలి, పనితీరుపై తన అంచనాలను అధిష్టాన ముఖ్యులతో పంచుకుంటున్న రేవంత్ రెడ్డి.
ముఖ్యంగా విద్య ,మున్సిపల్ పట్టణాభివృద్ధి,హోం న్యాయ సహ పదికి పైగా కీలక శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న మున్సిపల్పట్టణాభివృద్ధి శాఖను విడగొట్టి మున్సిపల్ శాఖను మరొకరికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు తనకు కీలకమైన విద్యుత్ శాఖ ఇవ్వాలని వివేక్ కోరినట్టు సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద విద్యుత్ శాఖ ఉంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న కార్పోరేషన్ చైర్మన్ పదవులతో పార్టీపై అలిగిన నేతలకు కట్టబెట్టి వారిని బుజ్జగించే అవకాశాలున్నాయనేది సమాచారం. దీనిపై ఓ వారం రోజుల్లోనే కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Also Read: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఎన్టీఆర్, బాలకృష్ణలకు మాత్రమే సొంతం..
Also Read: ఈ పుట్టినరోజు నందమూరి బాలకృష్ణకు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









