rayala ramu attacks on khammam lady sub inspector in khammam: సమాజంలో మహిళలకు అన్యాయం జరిగితే, వేధింపులు ఎదుర్కొంటే.. పోలీసుల దగ్గరకు వెళ్లి, తమ గోడును చెప్పుకుంటారు. అయితే.. తెలంగాణలో ప్రస్తుతం ఖాకీ దుస్తులు వేసుకున్న మహిళ అధికారిణికే అన్యాయం జరిగింది. రాత్రిపూట డ్యూటీలో ఉన్న లేడీ ఎస్‌ఐ పట్ల కొంత మంది కాంగ్రెస్ నేతలు దురుసుగా ప్రవర్తించడమేకాకుండా.. ఆమెను దూరంగా నెట్టివేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది.
ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్‌ఐ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆమె ఛాతీపై చేయి వేసి పక్కకు తోసేయడంతో అధికారిణి ఒక్కసారిగా షాకింగ్ కు గురైంది.. నిన్న రాత్రి తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయల రాము.. స్థానికంగా కల్లూరు ఎన్‌ఎస్పీలోని ఓ హోటల్‌కు వచ్చాడు. అక్కడ మద్యం మత్తులో పరోటా విషయంలో గొడవ జరిగింది.
రాత్రి ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ ఐ చెంపపై కొట్టడంతో కాంగ్రెస్ నాయకుడు ఎస్ ఐ. ని కొట్టాడు pic.twitter.com/yt76jPQFgj
— DONTHU RAMESH (@DonthuRamesh) June 7, 2025
గొడవ ముదరడంతో హోటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో కల్లూరు ఎస్‌ఐ హరిత.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో లేడీ ఎస్పైపై దాడికి దిగి, దూశిస్తు ఆమెను తోసేశారు.
దీంతో ఎస్‌ఐ హరిత.. రాముపై చేయి చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాము… నన్నే కొడతావా అంటూ విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ హరితను తోసేసి అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశాడు.
లేడీ అధికారిణి అని కూడా చూడకుండా ఆమె భుజాన్ని బలంగా నెట్టివేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో అదనపు బలగాలు అక్కడకు చేరుకుని, రాముతో పాటు, అక్కడున్న కొంత మంది అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదుచేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









