Telangana MLC Elections: ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలబడే అర్హత లేదని ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు ఎందుకు వేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నా హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలబడే అర్హత లేదని చెప్పారు.
Also Read: Neera Cafe: హైదరాబాద్ ప్రజలకు భారీ షాక్.. నీరా దుకాణం బంద్?
కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేసిన అనంతరం మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఒక సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం మూడు జిల్లాలు తిరిగిన దాఖలాలు లేవని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి ఎమ్మెల్సీ ఓట్లను అడగాలని చెప్పారు.
Also Read: SLBC Tunnel Collapse: ఎస్ఎల్బీసీ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన డిమాండ్
ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలబడలేదని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చందుకు రాష్ట్ర ఖజానా ఖాళీ అంటున్న రేవంత్ రెడ్డికి ఎన్నికల ముందు ఖజానా ఖాళీ ఉందని కనపడలేదా అని ప్రశ్నించారు. అబద్దాల హామీల నెరవేర్చవలసి వస్తుందనే కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ పాలన బాగుంది కనుకనే దేశ ప్రజలు మూడుసార్లు బీజేపీని అధికారంలోకి తెచ్చారని ఎంపీ డీకే అరుణ గుర్తుచేశారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంటే మొన్న ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సున్నాతో బుద్ది చెప్పారని డీకే అరుణ విమర్శించారు. మోడీ పాలనను యావత్ ప్రపంచం మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ కుళ్లు రాజకీయాలకు పాల్పడుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









