Teenmaar Mallanna: 'పార్టీ టికెట్‌పై ఎమ్మెల్సీగా గెలిచావ్‌ గుర్తుంచుకో'.. తీన్మార్‌ మల్లన్నకు షోకాజ్‌ నోటీస్‌

TPCC Issued Show Cause Notice To Teenmaar Mallanna: పార్టీకి వ్యతిరేకంగా.. రేవంత్‌ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులకు మల్లన్న ఎలా స్పందిస్తారోననే ఉత్కంఠ నెలకొంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 6, 2025, 07:23 PM IST
Teenmaar Mallanna: 'పార్టీ టికెట్‌పై ఎమ్మెల్సీగా గెలిచావ్‌ గుర్తుంచుకో'.. తీన్మార్‌ మల్లన్నకు షోకాజ్‌ నోటీస్‌

Teenmaar Mallanna: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న చింతపండు నవీన్‌ కుమార్‌కు కాంగ్రెస్‌ పార్టీ భారీ షాక్‌ ఇచ్చింది. ఓ సామాజిక వర్గాన్ని దూషిస్తుండడమే కాకుండా కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా.. రేవంత్‌ రెడ్డిపై దుర్భాషలాడడం.. ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో వివరణ ఇవ్వాలని నోటీసు అందించింది. కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణా సంఘం మల్లన్నకు నోటీసులు పంపించింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.

Add Zee News as a Preferred Source

Also Read: Foreign Liquor: మద్యం ప్రియులకు జాక్‌పాట్‌.. ఒకే దుకాణం మూడు బ్రాండ్ల మద్యం

పార్టీ అగ్ర నాయకత్వం దిశానిర్దేశంతో బీసీలకు సంబంధించి కుల గణన చేపట్టినట్లు కాంగ్రెస్‌ పార్టీ క్రమ శిక్షణా సంఘం జారీ చేసిన నోటీసుల్లో గుర్తు చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బీసీ కుల గణనపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం తగదని బీసీల అంశంలో పార్టీ లైన్‌ దాటి ప్రవర్తించారని గుర్తుచేసింది. 'మీరు కాంగ్రెస్‌ పార్టీ బీ ఫారంపై వరంగల్‌-ఖమ్మం-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన విషయాన్ని మరచిపోతున్నారు' అంటూ ఒక విధంగా ఆ పార్టీ హెచ్చరించింది. ఆ విషయాన్ని మరచి ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. సరైన వివరణ ఇవ్వకపోతే పార్టీ కఠిన చర్యలకు కూడా వెనుకాడదని కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ జి.చిన్నారెడ్డి స్పష్టం చేశారు.

Also Read: KA Paul: 'ట్రంప్‌ భారతదేశ పౌరులను తరిమేస్తుంటే.. ప్రధాని మోదీ ఏం చేస్తున్నారు?

ఈ నోటీసుల్లో బీసీ కులగణనను ప్రభుత్వం ఎలా చేపట్టిందో సవివరంగా తీన్మార్‌ మల్లన్నకు వివరించింది. అలాంటి సర్వేపై విచక్షణా రహితంగా విమర్శలు చేయడమే కాకుండా కుల గణన పత్రాలను దహనం చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఇప్పటికే మంత్రులు, ఓ సామాజిక వర్గం నాయకులు మల్లన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఇంకోవైపు కొన్ని సంఘాల నాయకులు మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ షోకాజ్‌ నోటీసులపై తీన్మార్‌ మల్లన్న ఎలా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే నోటీసులు ఇచ్చేందుకు వాళ్లెవరు? అని మల్లన్న ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ వివాదం మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో తీన్మార్‌ మల్లన్న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News