)
Janahita Padayatra: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. ముఖ్యమంత్రిగా రెండేళ్ల పాలనను రేవంత్ రెడ్డి పూర్తి చేసుకోబోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ జనంలోకి వెళ్లారు. ఆమె పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఇప్పటికే మొదటి విడత పాదయాత్ర పూర్తి అయింది. రెండవ విడత పాదయాత్రను స్టార్ట్ చేద్దామని అనుకునేలోగా వర్షాల వలన వాయిదా వేశారు. ఆ తర్వాత కామారెడ్డిలో బహిరంగ సభ ఉండటంతో వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పెద్దలు పాదయాత్రకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోంది. రైతు రుణమాఫీ, ఫ్రీ బస్ పథకంతో పాటు మరిన్ని పథకాలను అమలు చేస్తున్నారు. అలాగే ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటుగా క్యాడర్ ను యాక్టివ్ చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకోసమే టీపీసీసీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రను చేపట్టారని పార్టీ నేతలు ప్రకటించారు. మరోవైపు స్ధానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు జనహిత పాదయాత్ర లాభం చేస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అందుకే జనహిత పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రలో యాక్టివ్ గా పాల్గొన్నారు. తనకు ఆదివాసీ గిరిజనులతో మమేకం అయ్యే ఛాన్స్ వచ్చిందని పాదయాత్రపై మీనాక్షి నటరాజన్ కామెంట్స్ చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పీసీసీ చేస్తున్న జనహిత పాదయాత్ర గురించి వివరించారు. పాదయాత్రలో భాగస్వామ్యం కావాలని సీఎంను పీసీసీ చీఫ్ కోరారు. దీనిపై సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులంతా హాజరు అవుతామని సీఎం రేవంత్ కూడా చెప్పారు. దసరా తర్వాత రెండవ విడత పాదయాత్ర షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కానీ రిజర్వేషన్ల వ్యవహారం రాష్ట్రపతి వద్దకు చేరడంతో నిర్ణయం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.. ఈ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోడీని కోరారు. మరోవైపు రిజర్లేషన్ల వ్యవహారం ఇప్పట్లో తేలే పరిస్థితి లేదన్న చర్చ సైతం లేకపోలేదు. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగకుండా టీపీసీసీ రంగంలోకి దిగింది. అందుకే రెండో విడత పాదయాత్రతో జనంలోకి వెళితే.. పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తంమీద జనహిత పాదయాత్ర నిరంతర ప్రక్రియ అంటోంది హస్తం పార్టీ. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రజలవద్దకే పాలనలో భాగమే తమ జనహిత పాదయాత్ర ముఖ్య ఉద్దేశ్యం అని నేతలు చెబుతున్నారు. మొదటి విడత పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని పార్టీ పెద్దలు నేరుగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లడంలో తమ పార్టీ చీఫ్ చేపట్టిన యాత్ర ఉపయోగపడుతుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.