తెలంగాణ స్క్రీనింగ్ కమిటీకి రాహుల్ గాంధీ ఆమోదం

తెలంగాణ స్క్రీనింగ్ కమిటీని ఖరారు చేసిన రాహుల్ గాంధీ

Updated: Sep 14, 2018, 06:51 PM IST
తెలంగాణ స్క్రీనింగ్ కమిటీకి రాహుల్ గాంధీ ఆమోదం

తెలంగాణలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ స్క్రీనింగ్ కమిటీని ఖరారు చేశారు. ఈ స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్‌గా భక్త చరణ్ దాస్, జ్యోతిమణి శెన్నిమలై, శర్మిస్త ముఖర్జీలను సభ్యులుగా ఆమోదిస్తూ రాహుల్ గాంధీ పార్టీకి ఆదేశాలు జారీచేశారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగిన భేటీలో రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు.