)
Jogulamba Woman Suicide: కోచింగ్ సెంటర్ లో ప్రేమ చిగురించి పెళ్లి వరకు దారితీస్తుందని ఆశలు పెట్టుకుందో యువతి. చివరికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ముఖం చాటేశాడు ఓ ప్రబుద్దుడు. అప్పటి వరకు నమ్మించి యువతి ఇంటికి వచ్చి మాట్లాడి పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులను కూడా ఒప్పించిన వ్యక్తి మోసం చేశాడని తెలిసింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఆ యువతి. పోరాటం చేసింది పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని రిమాండ్‌కు కూడా తరలించారు. అతని గదిలోనే ఉంటూ ఎదురు అతడి కోసం ఎదురు చూసింది. చివరికి శనివారం ఆత్మహత్య చేసుకుందానే సమాచారం బయటకు వచ్చింది.
పోలీసుల వివరాలు ప్రకారం చిన్నోనిపల్లె గ్రామానికి చెందిన రఘునాథ్ గౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రియాంకలకు హైదరాబాదులో కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. దీంతో యువతీ ఇంట్లో తల్లిదండ్రులను కూడా ఒప్పించాడు. ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుందాం అని నమ్మించి చివరిగా కానిస్టేబుల్ ఉద్యోగం రాగానే మాట దాటవేశాడు. ఫోన్లో పలుమార్లు సంప్రదించినా ఫలితం లేకపోయింది. ఇంటికి వెళ్ళగా కుటుంబ సభ్యులు నిరాకరించడంతో పాటు పలుమార్లు ప్రియాంకపై చేయి చేసుకున్నాడు.
తీవ్ర మనస్థాపానికి గురైన యువతి అప్పట్లోనే నిద్ర మాత్రలు కూడా మింగింది. ఆమెని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని రఘునాధ గౌడ్ ను వాళ్ళు రిమాండ్ కు తరలించారు. అదేవిధంగా డిఎస్పీకి కూడా యువతి ఫిర్యాదు చేసింది బాధితురాలు ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ విచారించి తగిన చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటన జూలై నెలలోనే జరిగింది.
అయితే, రఘునాథ్ గౌడు రిమాండ్‌కు వెళ్లినప్పటి నుంచి అతని గదిలోనే ఉంటుంది ప్రియాంక. అతడితో పెళ్లి కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి కూడా. గ్రామస్తులు ఆమెతో మాట్లాడినా.. ఆమెకు భోజనం పెట్టినా కానీ రఘునాథ గౌడ్ కుటుంబ సభ్యులు తిట్టేవారు. మూడు నెలలుగా అతని కోసం ఎదురు చూసింది. అయితే ప్రియాంక తండ్రి దసరాకు రమ్మని పిలిచిన కానీ రఘునాథ్ మల్దకల్ వచ్చాడని అతనితో కలిసి వస్తానని చెప్పిందట. అయితే శనివారం ఉదయం పురుగుల మందు తాగి కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో గద్వాల్ కు వచ్చాను అని తెలిపాడు మృతురాలి తండ్రి.
శుక్రవారం రఘునాథ్ గౌడ్‌ను కలిసిన ప్రియాంక గదికి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకుందా? లేకపోతే రాత్రి ప్రియాంక గదిలో ఉన్న సమయంలో కరెంట్ సప్లై నిలిపివేసి రఘునాథ్ కుటుంబ సభ్యులు ఆమెతో బలవంతంగా పురుగుల మందు తాగించారా ?అనేది తెలియాల్సి ఉంది. కూతురు ఆత్మహత్య చేసుకోలేదని.. హత్య చేశారని ప్రియాంక తండ్రి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రఘునాథ్‌ను పూర్తిగా విధుల నుంచి కూడా తొలగించారు. పై అధికారులు అతనితో పాటు మరికొంతమందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.