BC Bill Approves: బీసీ బిల్లు ఆమోదం పొందిన అనంతరం తనను అభినందించడానికి వచ్చిన బీసీ నాయకులతో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఈ అభినందనలు నాకు కాదు అందించాల్సింది రాహుల్ గాంధీకి' అని తెలిపారు. ఆ శుభాకాంక్షలు, అభినందనలు ఏవో రాహుల్ గాంధీకి చెప్పాలని సూచించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులసర్వే నిర్వహించినట్లు తెలిపారు.
Also Read: KA Paul: 'నా ఆస్తులు కొట్టేయాలని కుట్ర'.. చంద్రబాబు, పవన్‌పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు
అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం పొందిన అనంతరం బీసీ సంఘాలు, బీసీ ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. '50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తేలాలి. ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలి.. అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలు ఉంటుంది' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: Bumper Bonanza: ఐపీఎల్ బంపర్ బొనాంజా.. మ్యాచ్‌లకు ఉచిత ప్రయాణం
'అసెంబ్లీలో ఫిబ్రవరి 4వ తేదీకి ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఫిబ్రవరి 4వ తేదీని సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నాం. పక్కా ప్రణాళికతో మంత్రివర్గ ఉపసంఘం, అ తరువాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక టైం ఫ్రేమ్ లో కులసర్వే పూర్తి చేశాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. మొదటి విడతలో కులసర్వేలో పాల్గొనని వారికోసం రెండో విడతలో అవకాశం కల్పించామని.. పూర్తి పారదర్శకంగా కులసర్వేను పూర్తి చేశామని చెప్పారు. 'ఏ పరీక్షలోనైనా మనం చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్నా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేదే మా ఆలోచన' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కుల సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగస్వాములు కావడం తమకు గర్వకారణం ఉందని చెప్పారు. 'బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి. దీన్ని తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే' అని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ పరమైన రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల కోసం వేర్వేరుగా రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించుకున్నామని తెలిపారు.
'జనగణనలో కులగణన ఎప్పుడూ జరగలేదు. జనగణనలో కులగణనను చేర్చితే సరైన లెక్క తేలుతుంది. మండల్ కమిషన్ కూడా బీసీల లెక్క 52 శాతం అని తేల్చింది. కానీ మేం కులసర్వే ద్వారా బీసీల లెక్క 56.36 శాతంగా తేల్చాం' అని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. 'కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. ఈ కులగణన పునాది లాంటిది.. ముందు అమలు చేసుకుని తరువాత అవసరాన్నిబట్టి సవరణలు చేసుకోవచ్చు' అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









