Weather Update: తెలంగాణకు 'చల్లటి కబురు'.. రాబోయే రెండు రోజులు తగ్గనున్న ఉష్ణోగ్రతలు

Cool News For Telangana Temperatures Sudden Drop Coming 48 Hours: తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు. ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది. రాబోయే రెండు రోజులు ఉష్ణోగ్రతలు పడిపోయి చల్లటి గాలులు వీస్తాయని వాతావరణ నిపణులు చెబుతున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 5, 2025, 08:20 PM IST
Weather Update: తెలంగాణకు 'చల్లటి కబురు'.. రాబోయే రెండు రోజులు తగ్గనున్న ఉష్ణోగ్రతలు

Temperatures Sudden Drop: వేసవి ప్రారంభంలోనే ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో తెలంగాణ అల్లాడుతున్నారు. కానీ అనూహ్యంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. రెండు రోజుల పాటు చల్లటి వాతావరణం అలుముకోనుంది. ఎండలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టి చల్లటి గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రెండు రోజులు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని ప్రకటించారు. ఈ వార్తతో తెలంగాణ ప్రజలు ఉపశమనం పొందనున్నారు. వాతావరణ విశేషాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Teenmar Mallanna: 'ఏ పార్టీలోకి వెళ్లడం లేదు.. కొత్త పార్టీ పెట్టడం లేదు': తీన్మార్‌ మల్లన్న

రాబోయే రెండు రోజుల వాతావరణంపై తెలంగాణ వెదర్‌మ్యాన్‌గా గుర్తింపు పొందిన యువకుడు బాలాజీ ఒక కీలక ప్రకటన చేశాడు. రెండు రోజులు చల్లటి గాలులు వీస్తాయని ప్రకటించాడు. తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతాయని తెలిపాడు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్‌ జిల్లాలలో వాతావరణంలో మార్పులు వస్తాయని వివరించాడు.

Also Read: Adilabad CCI: కేటీఆర్‌ తీవ్ర విమర్శలు.. 'బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం'

రాత్రిపూటతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనుండగా.. దాని ప్రభావం పగటిపూట కూడా ఉంటుందని బాలాజీ పేర్కొన్నాడు. మధ్యాహ్నం వేళ కొంత తగ్గినా కూడా ఎండ వేడిమి ఉంటుందని వెల్లడించాడు. ఇక హైదరాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలతోపాటు శివారు ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశం నుంచి అకస్మాత్తుగా వీస్తున్న చల్లటి గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని వివరించాడు.

మార్చి 6,7 తేదీల్లో ఉదయం ఉష్నోగ్రతలు 10 నుంచి 12 డిగ్రీల మధ్యన ఉండనున్నాయని బాలాజీ తెలిపాడు. మధ్యాహ్నం యథావిధిగా 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని వెల్లడించాడు. మార్చి 6,7 తేదీల్లో హైదరాబాద్‌తోపాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా ఎండ వేడిమి నుంచి ఉపశమనం ఉంటుందని పేర్కొన్నాడు. ఉదయం పూట 14 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుందని తెలిపాడు. మార్చి 9వ తేదీ నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News