హైదరాబాద్‌లో కరోనా అనుమానితుడి కలకలం

కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే హైదరాబాద్‌లో ఒక్కసారిగా కరోనా అనుమానిత కేసు కలకలం రేపింది

Updated: Mar 22, 2020, 11:37 AM IST
హైదరాబాద్‌లో కరోనా అనుమానితుడి కలకలం

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే హైదరాబాద్‌లో ఒక్కసారిగా కరోనా అనుమానిత కేసు కలకలం రేపింది. నైజీరియా నుంచి ముంబైకి వచ్చి అక్కడినుంచి ముంబై ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించి నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న మోసిన్ అలీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జనతా కర్ఫ్యూ.. కరోనా వైరస్ చచ్చినట్లు చావాల్సిందే!

నగరంలోని మంగళ్ హాట్‌కి చెందిన మోసిన్ అలీ విదేశాల నుంచి రావడం, అతడి చేతిపై హోమ్ క్వారంటైన్ అని స్టాంప్ ఉంటాన్ని గమనించి తోటి ప్రయాణికుడు అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే నాంపల్లి రైల్వే పోలీసులు స్టేషన్ వద్దకు చేరుకుని మోసిన్ అలీని 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతడు నైజీరియా.. లాగోస్ నుంచి అబుదాబి మీదుగా ముంబైకి విమానంలో వచ్చాడు.

కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!

ముంబై నుంచి ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించి నేటి ఉదయం నాంపల్లి రైల్వేస్టేషన్‌లో దిగాడు. మోసిన్ అలీ చేతికి హోమ్ క్వారంటైన్ ముద్రను గుర్తించిన తోటి ప్రయాణికుడు అధికారులను అప్రమత్తం చేశాడు. దీంతో నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి అతడ్ని నేరుగా గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయిస్తున్నారు. కాగా, అతడు రైలులో ఎవరితో సన్నిహితంగా ఉన్నాడు, గత కొన్ని రోజులుగా ఎవరితో తిరిగాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos