)
Costly phone theft in Mehdipatnam police station Hyderabad: ఇటీవల కాలంలో దొంగలు పేట్రేగిపోయారు. ముఖ్యంగా కాస్లీ వస్తువుల్ని టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. బంగారం రేట్లు ఇటీవల ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. దీంతో వీటిని టార్గెట్ చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. సింగిల్ గా దొరికితే చాలు అస్సలు వదిలిపెట్టడంలేదు. మెడలోని బంగారంను స్కెచ్ లు వేసి చోరీలకు పాల్పడుతున్నారు. మరికొంత మంది వ్యక్తుల వద్ద కాస్లీ మొబైల్స్ లను టార్గెట్ చేసుకుంటున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న వెంటనే చోరీలు చేస్తున్నారు.
చాలా మంది చోరీలు జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్ లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తారు. ఇటీవల కొంత మంది పోలీసులు డిపార్ట్ మెంట్ పరువును తీసేలా ప్రవర్తిస్తున్నారు. ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. అంతే కాకుండా.. లంచాలు ఇవ్వకుంటే అక్రమ కేసులు బనాయిస్తామని వార్నింగ్ లు ఇస్తున్నారు. ఇలాంటి కొంత మంది వల్ల పూర్తిగా డిపార్ట్ మెంట్ కే చెడ్డపేరు వచ్చేలా మారింది. ఇప్పుడు ఒక పోలీసు ఏకంగా దొంగగా మారి పోలీస్ స్టేషన్ లలోనే చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
హైదరాబాద్ లోని మెహదీ పట్నంలో ఇటీవల ఒక చోరీ జరిగింది. స్థానికంగా ఉన్న రైతు బజారులో ఒక వ్యక్తి మార్కెట్ కు వచ్చాడు. అతను తన పనుల్లో బిజీగా ఉండగా ఫోన్ ను ఎవరో చోరీ చేశారు. దాని విలువ రూ.1.75 లక్షలు. వెంటనే బాధితుడు లబో దిబో మంటూ స్థానికంగా ఉన్నమెహదీ పట్నం పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సీసీకెమెరాలు అన్ని జల్లెడపట్టి కొంత మందిని అదుపులోకి తీసుకుని రూ.1.75 లక్షల ఫోనును స్వాధీనం చేసుకున్నారు. దాన్ని వెంటనే పోలీసు స్టేషన్ లోని లాకర్లో దాచిపెట్టారు. అయితే.. ఫోన్ ను లాకర్ లో నుంచి మరుసటి రోజు మాయం అయ్యింది. పోలీస్ డ్రైవర్ శ్రవణ్ కుమార్ దాన్ని సీక్రెట్ గా కాజేశాడు.
దీంతో పోలీసులు సీసీకెమెరాలో చూడగా పోలీస్ డ్రైవర్ శ్రవణ్ కుమార్ ఘన కార్యం బైటపడింది. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. పోలీసు స్టేషన్ లో చోరీజరగటం ఏంట్రా అని అందరు ఆశ్చర్యపోతున్నారు. మొత్తంగా పోలీసులు దొంగలుగా మారితే ఇంకా ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందని ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook