Bhadrachalam Kalyanotsavam: భద్రాద్రి రాములోకి కల్యాణం కోసం ముస్తాబైంది. ఉత్సవాల సందర్భంగా భద్రాచలం పట్టణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం, మిథిలా స్టేడియం పరిసర ప్రాంతాలు చలువ పందిళ్లు చాందినీ వస్త్రాలతో అలంకరించారు. ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చొరవతో భక్తుల కోసం మిథిలా స్టేడియంలోని అన్ని సెక్టార్లలో పొగమంచు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు వేడి నుంచి ఉపశమనం లభించనుంది. విద్యుద్దీపాలంకరణతో ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది.
Also Read: Ramayan: రామాయణం ఎందుకు చదవాలి? ఆసక్తికర రహాస్యాలు ఇవే!
ఉత్సవాల్లో భాగంగా శనివారం ఎదుర్కోళ్ల కార్యక్రమం, రేపు సీతారాముల కల్యాణం, ఈనెల 7వ తేదీన రాములోరి పట్టాభిషేకం జరగనుంది. రాములోరికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులు రానున్నారు. భారీ ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. కల్యాణానికి వేదికగా ఉన్న మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నాలుగు లక్షల చదరపు అడుగుల్లో చలువ పందిళ్లను ఏర్పాటుతోపాటు, సెక్టార్లలోని భక్తులకు నేరుగా మజ్జిగ, తాగునీరు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నవమికి తరలివచ్చే భక్తుల కోసం 19 ప్రసాదాల కౌంటర్లు, 80 తలంబ్రాల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నవమి అనంతరం కార్గో, పోస్టల్, ఆన్‌లైన్, ప్రచార శాఖల ద్వారా ముత్యాల తలంబ్రాలను పంపేందుకు చర్యలు చేపట్టినట్లు ఈఓ రమాదేవి వెల్లడించారు.
Also Read: Shobha Yatra: శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీస్ నిఘా.. అసాధారణ రీతిలో పకడ్బందీ బందోబస్తు
వేములవాడలో..
హరిహర క్షేత్రమైన వేములవాడ రాజన్న క్షేత్రంలో కూడా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనుంది. వేములవాడ ఆలయంలో దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో భారీ ఏర్పాట్లు చేశారు. ఉగాది నుంచి ప్రారంభమైన శ్రీరామ నవరాత్రి మహోత్సవాలు రాజన్న ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామ కల్యాణ మహోత్సవం సందర్భంగా ఉదయం మూలవిరాట్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆలయ వెనుక భాగంలో చైర్మన్ గెస్ట్ హౌస్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కల్యాణ వేదిక వద్ద ఉదయం 11: 55 అభిజిత్ లగ్న సుముహూర్తమున శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం జరగనుంది. ఉత్సవానికి వచ్చే భక్తులకు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, కల్యాణం వీక్షించే భక్తులకు గ్యాలరీలు ఎల్ఈడి స్క్రీన్లు తదితర ఏర్పాట్లు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.








