cyber fraud nude call to mla vemula veeresham: ప్రస్తుతం ఎక్కడ చూసి సైబర్ నేరగాళ్లు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. కొత్త కొత్త సాఫ్ట్ వేర్ లతో అమాయకుల్ని మోసం చేస్తున్నారు. ఒకప్పుడు ఓటీపీలతో మోసాలకు పాల్పడేవారు. ఆ తర్వాత ఫెస్ బుక్ లలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి మరీ మోసాలు చేసేవారు. మరికొందరు ఆడవాళ్ల డీపీలు పెట్టుకుని.. హస్కీగా మాట్లడుతూ.. ప్రేమ చూపిస్తు అవతలి వారిని టెంప్ట్ చేస్తారు. ఆ తర్వాత న్యూడ్ కాల్స్ అంటూ వారిని రెచ్చగొడుతారు. ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి.
బ్యాంక్ అధికారుల మంటూ, కేవైసీ అప్ డేట్ అంటూ కూడా మోసాలకు పాల్పడ్డారు. అయితే.. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు న్యూడ్ వీడియో కాల్స్ చేస్తు అమాయకుల్ని మోసం చేస్తున్నారు. ఏదో ఒక నంబర్ తో వాట్సాప్ కు వీడియో కాల్స్ చేసి అవతలి వాళ్లు ఫోన్ ఎత్తగానే వెంటనే న్యూడ్ గా మాట్లాడతారు. తెరుకునేలోపు స్క్రీన్ షాట్ తీసి, ఫోన్ కాల్ రికార్డు తీసి మళ్లీ వాళ్లకే పెట్టి.. బ్లాక్ మెయిలింగ్ చేస్తారు.
తాజాగా.. ఈ రకపు సైబర్ మోసానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గురయ్యారు. వేముల వీరేశంకు ఇటీవల సైబర్ మోసాగాళ్లు రాత్రి పూట వీడియో కాల్ చేశారు. ఆయన తెరుకునే లోపు.. ఫోన్ కాల్స్ వీడియో తీసి, స్క్రీన్ షాట్ ఆయనకు వాట్సాప్ చేశారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుండా.. దీన్ని వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. సదరు ఎమ్మెల్యే దీనికి నిరాకరించారు.
వెంటనే ఇతర కాంగ్రెస్ నేతలకు వేముల వీరేశం న్యూడ్ కాల్స్ ఫోటోలు, వీడియోలు పంపంచారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే.. దీనిపై సదరు ఎమ్మెల్యేవేముల వీరేశం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









